Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హీరోయిన్‌గా ఉందని ప్రేమించి పెళ్లి.. కట్నం ఇవ్వలేదని జుట్టు కత్తిరింపు.. భర్త కిరాతక చర్య

ఆ యువతి హీరోయిన్‌లా అందంగా ఉందని ప్రేమించాడు. ఇద్దరం ఒక్కటవుదామని, కలిసి జీవిద్దామని నమ్మించాడు. తమిద్దరి కులాలు వేరు కావడంతో పెద్దలను ఒప్పించాలని చూశారు.. ఇందుకు పెద్దలు అంగీకరించలేదు.. ఆఖరికి పెద్దల

Advertiesment
హీరోయిన్‌గా ఉందని ప్రేమించి పెళ్లి.. కట్నం ఇవ్వలేదని జుట్టు కత్తిరింపు.. భర్త కిరాతక చర్య
, ఆదివారం, 18 డిశెంబరు 2016 (13:31 IST)
ఆ యువతి హీరోయిన్‌లా అందంగా ఉందని ప్రేమించాడు. ఇద్దరం ఒక్కటవుదామని, కలిసి జీవిద్దామని నమ్మించాడు. తమిద్దరి కులాలు వేరు కావడంతో పెద్దలను ఒప్పించాలని చూశారు.. ఇందుకు పెద్దలు అంగీకరించలేదు.. ఆఖరికి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నాడు. తీరా చూస్తే పెళ్లై యేడాదికాక మునుపే చిత్రహింసలకు గురి చేయడం ప్రారంభించాడు. అలా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే శాడిస్ట్‌‌గా మారాడు. సాధారణంగా ఏ భర్తయినా కోపమొస్తే కొట్టడమో, తిట్టడమో చేస్తాడు కానీ ఇతను చేసిన పనేంటో తెలిస్తే అవాక్కవుతారు. భార్య అంద విహీనంగా ఉండాలని ఆమె జుట్టు కత్తిరించాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
కాకినాడకు చెందిన ప్రసన్న అనే యువతిని వివేక్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లు పాటు వీరి కాపురం సాఫీగానే సాగింది. ఆర్నెళ్లు గడిచిన తర్వాత వివేక్ నిజ స్వరూపం బయటపడింది. పనీపాట లేకుండా ఖాళీగా తిరుగుతున్న వివేక్ భార్య నగలు అమ్మేశాడు. ఉద్యోగం కోసమని చెప్పి అత్తమామల దగ్గర లక్ష రూపాయిలు గుంజాడు. రోజుకు రోజుకు ప్రసన్నకు భర్త వేధింపులు పెరిగాయి. విడాకులివ్వమని ఒత్తిడి చేశాడు. 
 
అందుకు ఒప్పుకోకపోవడంతో ప్రసన్న పొడవాటి జుట్టును కత్తిరించేశాడు. ఆమె మొహంపై కత్తిగాట్లుపెట్టాడు. అడ్డొచ్చిన అత్తమామలను చితకబాదాడు. భర్త అరాచకాలను భరించలేక ప్రసన్న పోలీసులకు ఫిర్యాదు చేసినా అక్కడ ఆమెకు న్యాయం జరగలేదు. బాధితురాలు చివరకు మీడియాను ఆశ్రయించడంతో ఈ శాడిస్ట్ కిరాతక చర్య వెలుగులోకి వచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీజేపీ నేత దాష్టీకం.. గిరిజన యువతిని జుట్టుపట్టి లాక్కెళ్లి రేప్ చేశాడు... 36 గంటలపాటు...