మద్యం షాపులుండకూడదు.. తాగుబోతులను ప్రోత్సహించకండి: సుప్రీం కోర్టు హితవు
జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట 500 మీటర్లలోపు దూరంలో ఉండే మద్యం దుకాణాలను ఏప్రిల్ ఒకటో తేదీలోపు తొలగించాలంటూ గత ఏడాది డిసెంబరులో ఇచ్చిన తీర్పును సవరించాలంటూ పలు రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు మద్యం దుకాణద
జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట 500 మీటర్లలోపు దూరంలో ఉండే మద్యం దుకాణాలను ఏప్రిల్ ఒకటో తేదీలోపు తొలగించాలంటూ గత ఏడాది డిసెంబరులో ఇచ్చిన తీర్పును సవరించాలంటూ పలు రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు మద్యం దుకాణదారులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీశ సింగ్ ఖేహర్, న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ లావు నాగేశ్వరరావుతో కూడిన ధర్మాసనం గురువారం ఆ పిటిషన్లను విచారించింది.
ఈ సందర్భంగా ప్రజా ప్రయోజనాల రీత్యా ఆరోగ్యకర విధానాలను అమలు చేయడానికే రాష్ట్ర ప్రభుత్వాలు మొగ్గు చూపాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు సూచించింది. ఇంకా తాగుబోతులను ప్రోత్సహించేలా వ్యవహరించకూడదని సుప్రీం కోర్టు హితవు పలికింది.
అయితే రహదారులకు 500 మీటర్లలోపు మద్యం దుకాణాలు ఉండరాదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పటం సబబు కాదని తెలంగాణ తరపున ముకుల్ రోహత్గీ, ఏజీ రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ న్యాయవాది ఉదయ్‌కుమార్ సాగర్ తప్పుబట్టారు. ఈ తీర్పుతో 3000 షాపులపై ప్రభావం పడుతుందని, రూ.2400 కోట్ల ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తుందని వివరించారు.
ఇందుకు ధర్మాసనం స్పందిస్తూ.. మద్యం సేవించి వాహనాలు నడపటం వల్ల ప్రాణాలు కోల్పోయే వారు, వారి కుటుంబ సభ్యుల పరిస్థితిని గుర్తించాలని సూచించింది. ''వారిని ఆదుకునేవారు ఎవరూ ఉండరు. రాష్ట్రాలకు నష్టం వస్తే మరొక రూపంలో ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చునని తెలిపారు.