Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ ముసిలోడి ల్యాప్‌టాప్‌లో పొరుగింటి పిల్లల నగ్న చిత్రాలు.. భగవాన్

ఆడ పిల్లలకు ఏమాత్రం తెలియకుండానే, వారి నగ్న ఫొటోలను రహస్యంగా చిత్రించి వాటిని ల్యాప్‌టాప్ లోనో, మొబైల్ లోనో కాపీ చేసుకుని వికృతానందం పొందడం లైంగిక వేధింపు కాదా..

ఆ ముసిలోడి ల్యాప్‌టాప్‌లో పొరుగింటి పిల్లల నగ్న చిత్రాలు.. భగవాన్
హైదరాబాద్ , శుక్రవారం, 31 మార్చి 2017 (07:59 IST)
లైంగిక వేధింపు అంటే ఇష్టం లేకున్నప్పటికీ అమ్మాయిలను అల్లరి చేయడం, వన్ సైడ్ ప్రేమను వారిముందు పరచడం, వారి అంగాంగాలను తడమటం, అదేదో సినిమాలో చెప్పినట్లు సరదాగా రేప్ చేయడం మాత్రమే కాదని దేశదేశాల్లో బయటపడుతున్న పచ్చి నిజాలు చెబుతున్నాయి. ఆడ పిల్లలకు ఏమాత్రం తెలియకుండానే, వారి నగ్న ఫొటోలను రహస్యంగా చిత్రించి వాటిని ల్యాప్‌టాప్ లోనో, మొబైల్ లోనో కాపీ చేసుకుని వికృతానందం పొందడం లైంగిక వేధింపు కాదా.
 
అమెరికాలో ఒక ముసలాడి ల్యాప్‌టాప్‌లో అనుకోకుండా బయటపడిన ఫొటోలు ప్రపంచంలో ఇలాంటి వికృత వైపరీత్యాలు కూడా జరుగుతున్నాయని బయటపెట్టాయి. పదమూడేళ్ల బాలుడి ల్యాప్‌టాప్ పాడైతే పక్కింటి ముసలాయన జోయ్ గార్జా వద్ద ల్యాప్‌టాప్ అరువు తీసుకుని కాస్సేపు ఉపయోగించుకుని ఇస్తానని తీసుకున్నాడు. ఇంటికెళ్లాక ఆ ల్యాప్‌టాప్ చూసిన బాలుడు వణికిపోయాడు. అందులోని ఫొటోలు చూసి నివ్వెరపోయాడు. 
 
ఇంతకూ ఆ ఫొటోలు ఎవరివి. అంటే ఆ బాలుడి చెల్లెలి నగ్న చిత్రాలు. కేవలం పదేళ్ల వయసున్న ఆ చిన్నారి నగ్న చిత్రాలు. చూడగానే బిత్తరపోయిన బాలుడు విషయం తల్లికి చెప్పగా ఆమె మండిపడి కేసుపెడతానని ఆ ముసలాడికి చెప్పింది. కానీ ఆ ముసలాడు తనకు ఒకవ్యాధి ఉందని, ఆందుకే ఇలా ప్రవర్తిస్తున్నానని, కేసుపెట్టవద్దని వేడుకున్నాడు. ఆమె వినకుండా పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు అతగాడిని అరెస్టు చేశారు. 
 
అయితే అతగాడికి ఇదేం కొత్త కాదు.  సంవత్సరం వ్యవధిలోనే ఇలాంటి రెండు నేరాలకు పాల్పడ్డాడని విచారణలో తేలింది. ఇతగాడి బాధితులు ఇంకా ఎంతమంది ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఉదంతం వింటూంటే మనిషిని, తోటిమనిషిని, పొరుగింటి మనిషినైనా సరే నమ్మవచ్చా అనే సందేహం రాదా.. వ్యాధిగ్రస్తుడే అయినప్పటికీ పిల్లల నగ్న చిత్రాలు రహస్యంగా తీసిపెట్టుకోవడం సమంజసమేనా. 
 
అందుకే లైంగిక వేధింపులు గావుకేకలు, పెడబొబ్బలతోనే జరగవు.  మీకు తెలీకుండానే మీ పిల్లల నగ్న చిత్రాలను ఫోటో తీసి మౌనంగా, వాటిని చూస్తూ ఆనందపడటం కూడా లైంగిక వేధింపుగానే చూడాలి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కనీ వినీ ఎరుగని రాయితీలు..ఒక్క టూవీలర్‌కు రూ. 22 వేలు తగ్గింపు