Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా హీరో సుబ్రహ్మణ్య స్వామి.. ఆయన ఏది చెపితే అది విశ్వసిస్తా : ఉమాభారతి

నా హీరో సుబ్రహ్మణ్య స్వామి.. ఉమాభారతి

Advertiesment
Uma Bharti
, సోమవారం, 6 జూన్ 2016 (08:45 IST)
భారతీయ జనతా పార్టీలో వివాదాస్పద నేతగా ముద్రపడిన నేత డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి. అలాగే, ఆ పార్టీలో ఫైర్‌బ్రాండ్‌ ఉమాభారతి. వీరిద్దరు చేసే వ్యాఖ్యలు మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారుతుంటాయి. తాజాగా స్వామిని ఉద్దేశించి ఉమాభారతి కీలక వ్యాఖ్యలు చేశారు.
 
డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి నా హీరో. అందుకే ఆయన ఏం చెబితే నేను దానిని విశ్వసిస్తాను. అయోధ్యలో రామమందిర నిర్మాణ పని ఈ ఏడాది ఆఖరునాటికి ప్రారంభమవుతుందన్న ఆయన మాటలను నమ్ముతున్నాను. దశాబ్దాల నుంచి అపరిష్కృతంగా ఉన్న ఈ వివాదం చర్చల ద్వారానే పరిష్కారమవుతుంది. అందునా అద్భుతమైన పరిష్కారం లభిస్తుంది. అయోధ్యలో అత్యద్భుత రామాలయం నిర్మిస్తామంటూ ఉమాభారతి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మళ్లీ పరీక్షలు నిర్వహిస్తే.. ఆత్మహత్య చేసుకొంటా.. బీహార్ టాపర్ హెచ్చరిక