డీఎంకే దేశ ద్రోహులు కంటే.. శశికళ వంటి అవినీతిపరులు బెస్ట్ : సుబ్రమణ్య స్వామి
తమిళనాడు రాష్ట్రంలో అధికారంలో డీఎంకే వంటి దేశ ద్రోహుల కంటే.. శశికళ వంటి అవినీతిపరులు ఉండటం ఎంతో మేలని భారతీయ జనతా పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి అన్నారు. అన్నాడీఎంకే ఏర్పడిన
తమిళనాడు రాష్ట్రంలో అధికారంలో డీఎంకే వంటి దేశ ద్రోహుల కంటే.. శశికళ వంటి అవినీతిపరులు ఉండటం ఎంతో మేలని భారతీయ జనతా పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి అన్నారు. అన్నాడీఎంకే ఏర్పడిన తిరుగుబాటు తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా శశికళే ఉండాలని స్వామి గట్టిగా పట్టుబట్టారు. దీనికిగల కారణాలను ఆయన తాజాగా వెల్లడించారు.
శశికళకు హిందుత్వ భావన ఎక్కువగా ఉందని, ఆమె దేవాలయాలకు వెళతారని, అదే, డీఎంకే వాళ్లు హిందూ వ్యతిరేకులని, ఆలయాలను ధ్వంసం చేస్తారని స్వామి అన్నారు. తమిళనాడు సీఎంగా డీఎంకేలోని దేశ ద్రోహులు ఉండటం కంటే అన్నాడీఎంకేలోని అవినీతి పరులు ఉండటమే నయమని, డీఎంకే నేతలు ప్రముఖ దేవాలయాల వ్యవహారాలపై కోర్టుల్లో కేసులు వేస్తారని సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యానించడం గమనార్హం.
కాగా, అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకు వెళ్లడంతో ఆమె మద్దతుదారుడు ఎడప్పాడి కె.పళని స్వామికి ఆయన మద్దతు ప్రకటించడం తెలిసిందే. పళనిస్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించకుంటే కేసు వేస్తానని స్వామి బహిరంగంగా ప్రకటించిన విషయం తెల్సిందే.