వైకాపాలోకి లగడపాటి.. జగన్మోహన్ రెడ్డితో మంతనాలు
లగడపాటి రాజగోపాల్. ఈయన గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఎంపిగా కొనసాగి, అందరిని చెడామడా తిట్టడంలో ఈయనకు ఈయనే సాటి. సమైక్యాంధ్ర ఉద్యమం నుంచి అంతకు ముందు జరిగిన అన్ని ఉద్యమాల వరకు ఎప
లగడపాటి రాజగోపాల్. ఈయన గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఎంపిగా కొనసాగి, అందరిని చెడామడా తిట్టడంలో ఈయనకు ఈయనే సాటి. సమైక్యాంధ్ర ఉద్యమం నుంచి అంతకు ముందు జరిగిన అన్ని ఉద్యమాల వరకు ఎప్పుడూ ముందుండి గలాగలా మాట్లాడే ఈయన ఆ తర్వాత రాజకీయ సన్యాసం తీసేసుకున్నారు. ఏ టివీ ఛానల్లో చూసినా ప్రతిరోజు లగడపాటి సంచలన వ్యాఖ్యలున్న కథనాలు ఎప్పుడూ వస్తుంటారు. కాంగ్రెస్ పార్టీలో కీలకనేతగా ఉన్న లగడపాటి ఏకంగా కాంగ్రెస్ అధిష్టానానికే కావాల్సినంత నిధులు ఇస్తుండేవారు. ఎన్నో పరిశ్రమలులు ఉండి భారీగా ఆదాయాన్ని సంపాదించే లగడపాటి ఆ తర్వాత మెల్లమెల్లగా రాజకీయాలకు దూరమయ్యారు.
కానీ ప్రస్తుతం వైసిపిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు లగడపాటి. ఇది నిజమేనంటున్నారు ఆయన సన్నిహితులు. ఇప్పటికే వైసిపిలో చేరేందుకు జగన్మోహన్ రెడ్డిని స్వయంగా లగడపాటి కూడా కలిశారట. అది కూడా బెంగుళూరులోని జగన్ నివాసానికి వెళ్ళిన లగడపాటి గంటకుపైగా మాట్లాడారట. రెండురోజుల క్రితం జరిగిన వీరి భేటిలో పలు ఆశక్తికర చర్చ జరిగిందని తెలుస్తోంది. మొదట్లో జగన్‌పై కూడా లగడపాటి కొన్ని విమర్శలు చేశారు. కొంత మంది మధ్యవర్తుల ద్వారా లగడపాటి వైసిపిలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కానీ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం కాకుండా వేరొకరి నిర్ణయం ఉండదు కాబట్టి ఆయన్నే నేరుగా కలిశారట లగడపాటి.
అయితే వీరి భేటిలో కొన్ని విషయాలను అడిగారట జగన్. ఇన్ని రోజులు ఖాళీగా ఉండి ఇప్పుడు ఉన్నట్లుండి వైకాపాలోకి రావాలనుకుంటున్నారు అని అడిగారట. దీంతో లగడపాటి వద్ద సమాధానం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో లగడపాటి వైసిపి వైపు మ్రొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. అన్ని మాట్లాడిన జగన్ ఆ తర్వాత పార్టీలోకి రావాలని ఆహ్వానించాడట. దీంతో లగడపాటి ఎగిరి గంతేసినంత పనిచేసి సరేనని తలూపాడట. మొత్తం మీద లగడపాటి వైసిపి చేరిక దాదాపు ఖరారైంది. ఇప్పటి వరకు ఉన్న ఎంపిలు లగడపాటిని ఏ మాత్రం స్వాగతిస్తారో వేచి చూడాల్సిందే.