రాజస్థాన్ కోటాలో మరో నీట్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. యూపీకి చెందిన మరో విద్యార్థి నీట్ పరీక్షల కోసం రెడీ అవుతున్నాడు. ఇంతలో ఏమైందో ఏమో కానీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాజాగా విద్యార్థి మృతితో ఈ ఏడాది 26 కేసులు కావడం గమనార్హం.
కోటాలో నీట్ సంబంధిత విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. వీటిని నియంత్రించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నా ప్రయోజనం లేకపోతోంది.
విద్యార్థుల మానసిక స్థితిని మెరుకుపరచడానికి ప్రత్యేక తరగతులను కూడా నిర్వహిస్తున్నారు. అయినా విద్యార్థుల ఆత్మహత్యలు ఏ మాత్రం తగ్గడం లేదు.