Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇకపై పుల్ల ఇడ్లీలు - బెంగుళూరు కుక్ కొత్త ఆవిష్కరణ

Advertiesment
ఇకపై పుల్ల ఇడ్లీలు - బెంగుళూరు కుక్ కొత్త ఆవిష్కరణ
, శుక్రవారం, 1 అక్టోబరు 2021 (15:57 IST)
సాధారణంగా ప్రతి ఒక్కరూ సాంబార్ ఇడ్లీ, ఘీ ఇడ్లీ, బటర్ ఇడ్లీ.. వంటి వెరైటీలు వినే ఉంటాం.. తినే ఉంటాం. ఇది పుల్ల ఇడ్లీ. అవును అచ్చంగా అది ఇడ్లీనే. ఐస్ క్రీంను తలపించే పుల్ల ఇడ్లీనే. దేశ ఐటీ రాజధాని అయిన బెంగళూరులోని ఓ హోటల్‌లో ఇలా కొత్తగా ఇడ్లీకి మేకప్ టచ్ ఇచ్చారన్నమాట.
 
ఈ ఫోటోను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర కంట పడింది. ఇలాంటి కొత్త ఆలోచనలు కనిపిస్తే ఆయన ఊరుకుంటారా చెప్పండి! వెంటనే ట్విట్టర్‌లో ఆ ఫొటో పెట్టేశారు. ‘‘భారత ఆవిష్కరణల రాజధాని అయిన బెంగళూరు.. సృజనాత్మకతలో ఎక్కడా ఆగట్లేదు. అసలు ఊహించనిదారుల్లో ఊహించని కొత్త ఆవిష్కరణలు వచ్చేస్తున్నాయి. ఇదిగో ఈ పుల్ల ఇడ్లీనే ఉదాహరణ. సాంబార్, చట్నీలో ముంచుకుని తినేయడమే. మీకు నచ్చిందా? నచ్చని వారెవరైనా ఉన్నారా?’’ అంటూ ట్వీట్ చేశారు.
 
ఆయన అలా ట్వీట్ చేయడం.. నెటిజన్లు రెస్పాండ్ అవ్వడం చకచకా జరిగిపోయాయి. రుచిగా ఉంటే దాని గమ్యం పొట్టే అంటూ ఓ నెటిజన్ రిప్లై ఇచ్చాడు. చెంచాలు, నీళ్ల కొరతకు మంచి ఉపాయం చేశారేనని ఇంకొకరు, చేతులు కడుక్కోవాల్సిన పనిలేదని, నీళ్లను ఆదాచేయొచ్చని మరొకరు కామెంట్ చేశారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రభుత్వ మద్యం దుకాణాలకు జగనన్న పేరు పెట్టాలి