Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జయలలిత సిరుదావూర్ బంగ్లాలో అస్థిపంజరం: అది ఎవరిది? దినకరన్‌కు లింకుందా?

తమిళనాడు దివంగత సీఎం జయలలితకు చెందిన సిరుదావూర్ బంగ్లా వద్ద అస్థిపంజరం బయటపడటం కలకలం రేపుతోంది. ఒకప్పుడు జయలలిత గెస్ట్ హౌజ్‌గా ఉన్న ఈ ఇల్లు ప్రస్తుతం శశికళ బంధువులైన మన్నార్ గుడి మాఫియా చేతిలో ఉంది. జ

Advertiesment
జయలలిత సిరుదావూర్ బంగ్లాలో అస్థిపంజరం: అది ఎవరిది? దినకరన్‌కు లింకుందా?
, గురువారం, 29 జూన్ 2017 (15:04 IST)
దివంగత ముఖ్యమంత్రి జయలలిత లేని లోటు తమిళనాట స్పష్టంగా కనిపిస్తోంది. అమ్మ మరణానికి తర్వాత అన్నాడీఎంకే లుకలుకలు.. కొడనాడు ఎస్టేట్‌లో హత్యలు, శశికళ, దినకరన్‌కు కష్టాలు తప్పలేదు. మాజీ సీఎం పన్నీర్ సెల్వం రెబల్ స్టారుగా మారాక.. అన్నాడీఎంకే పార్టీకి తమిళనాడులో గుర్తింపు లేకుండా పోయింది. ఓపీఎస్ శశికళ టీమ్‌ను పక్కనబెట్టాలనుకుంటుంటే.. చిన్నమ్మ సీటులో కూర్చోబెట్టిన పళని సామి సీఎంగా తన పని తాను చేసుకుపోతున్నారు. 
 
తాజాగా తమిళనాడు దివంగత సీఎం జయలలితకు చెందిన సిరుదావూర్ బంగ్లా వద్ద అస్థిపంజరం బయటపడటం కలకలం రేపుతోంది. ఒకప్పుడు జయలలిత గెస్ట్ హౌజ్‌గా ఉన్న ఈ ఇల్లు ప్రస్తుతం శశికళ బంధువులైన మన్నార్ గుడి మాఫియా చేతిలో ఉంది. జయలలిత మరణం తర్వాత ఇక్కడ పోలీసు కాపలా తీసేశారు. ప్రస్తుతం సాయుధ పోలీసులు మాత్రమే ఇక్కడ గస్తీ కాస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ అస్థిపంజరం దొరకడం చర్చనీయాంశంగా మారింది.
 
అమ్మ మరణానికి తర్వాత పోయెస్ గార్డెన్‌లో భద్రత తగ్గించారు. సిరుదావూరు బంగ్లాలో పోలీసులు మాత్రమే కాపలా కాస్తున్నారు. గత ఏప్రిల్‌‌లో బంగ్లాలో జరిగిన భారీ అగ్నిప్రమాదానికి ప్రస్తుతం ఇక్కడ లభించిన అస్తిపంజరానికి ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 
 
అయితే బంగ్లా వెనుక భాగంలో సెక్యూరిటీగా పనిచేసిన వ్యక్తి అవశేషాలుగా వాటిని గుర్తించారు. అతడి మృతి ఎలా సంభవించింది? అతడు అగ్నిప్రమాదంలో మరణించాడా? లేకుంటే ఎవరైనా చంపారా? అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. బంగ్లాలో అగ్ని ప్రమాదం జరిగిన నాటికి దినకరన్‌‌ను పార్టీ నుంచి తప్పించారు. దీంతో దినకరన్‌పై అనుమానాలు బలపడుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్తకు పక్షవాతం... బావతో పడకసుఖం... మోజు తీరాక తలపై రాయితో కొట్టి...