Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భర్తకు పక్షవాతం... బావతో పడకసుఖం... మోజు తీరాక తలపై రాయితో కొట్టి...

పక్షవాతంతో మంచానపడిన భర్త వల్ల శారీరకసుఖం లభించలేదని భావించిన ఓ వివాహిత.. వరుసకు బావయ్యే వ్యక్తితో పడక పంచుకుంది. మోజు తీరిన తర్వాత ఆమెను అతనే హత్య చేశాడు. దీంతో ఆమె ఇద్దరు పిల్లలూ అనాథలయ్యారు. వరంగల్

Advertiesment
భర్తకు పక్షవాతం... బావతో పడకసుఖం... మోజు తీరాక తలపై రాయితో కొట్టి...
, గురువారం, 29 జూన్ 2017 (14:48 IST)
పక్షవాతంతో మంచానపడిన భర్త వల్ల శారీరకసుఖం లభించలేదని భావించిన ఓ వివాహిత.. వరుసకు బావయ్యే వ్యక్తితో పడక పంచుకుంది. మోజు తీరిన తర్వాత ఆమెను అతనే హత్య చేశాడు. దీంతో ఆమె ఇద్దరు పిల్లలూ అనాథలయ్యారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లి గ్రామ శివారులో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
జిల్లాలోని నెక్కొండ మండలం గుండ్రపల్లికి చెందిన పఠాని సలీమా (27) తన భర్త యాకూబ్‌తో పాటు తన ఇద్దరు కుమారులతో కలిసి కిరాణ షాపును నడుపుతూ జీవిస్తోంది. గతంలో తన భర్త నాలుగేళ్లపాటు సౌదీకి వెళ్లి వచ్చాడు. ఈ క్రమంలోనే సంవత్సరం క్రితం యాకూబ్‌కు పక్షవాతం వచ్చి కాళ్లు చచ్చుపడిపోయాయి. దీంతో కిరాణం దుకాణానికి కావాల్సిన సామాన్లను తీసుకువచ్చేందుకు నెక్కొండకు చెందిన వరుసకు బావ అయిన చిరువ్యాపారం చేసుకుంటున్న పఠాన్‌లాలుతో కలిసి సలీమా వెళుతూ వచ్చేది. 
 
ఈ క్రమంలో పఠాన్‌లాలుతో సలీమాకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ ఇద్దరు కలిసి మంగళవారం తీగరాజుపల్లి గ్రామశివారులోకి వెళ్లారు. అక్కడ మద్యం తాగిన అనంతరం తనతోపాటు ఇతరులతో కూడా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నావంటూ సలీమాను లాలు నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో లాలూ రాయితో సలీమా తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నీ నవ్వు సూపర్.. రిపోర్టర్‌‌కు కితాబిచ్చిన డొనాల్డ్ ట్రంప్.. వీడియో చూడండి