Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డాక్టర్లు షాక్... ఆరేళ్ల బాలుడికి గర్భం, ఎలా సాధ్యం?

వారణాసిలో షాకింగ్ విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆరేళ్ల బాలుడు గర్భం ధరించడం అందరినీ షాక్‌కు గురిచేసింది. వివరాల్లోకి వెళితే... వారణాసిలో నివాసముంటున్న ఓ కుటుంబం తమ ఆరేళ్ల బాలుడు తరచూ కడుపునొప్పితో బాధపడటాన్ని గమనించారు. వైద్యుల వద్దకు తీసుకుని వెళి

Advertiesment
డాక్టర్లు షాక్... ఆరేళ్ల బాలుడికి గర్భం, ఎలా సాధ్యం?
, శనివారం, 2 డిశెంబరు 2017 (14:33 IST)
వారణాసిలో షాకింగ్ విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆరేళ్ల బాలుడు గర్భం ధరించడం అందరినీ షాక్‌కు గురిచేసింది. వివరాల్లోకి వెళితే... వారణాసిలో నివాసముంటున్న ఓ కుటుంబం తమ ఆరేళ్ల బాలుడు తరచూ కడుపునొప్పితో బాధపడటాన్ని గమనించారు. వైద్యుల వద్దకు తీసుకుని వెళితే ఏవేవో మందులు రాసిచ్చారు. వాటిని తీసుకున్నప్పటికీ బాలుడిలో మార్పు రాలేదు. పైగా పొట్ట భాగం కాస్త పెద్దదిగా మారడం కనిపించింది. దీనితో నిపుణులైన వైద్యుల వద్దకు తీసుకుని వెళ్లారు. 
 
ఆ బాలుడిని పరీక్షించిన వైద్యులు, బాలుడి కడుపులో గడ్డ వున్నదనీ, శస్త్ర చికిత్స చేసి తీసేయాలని చెప్పారు. బాలుడి తల్లిదండ్రులు అన్నీ సిద్ధం చేసుకుని బాలుడిని ఆపరేషన్‌కు తీసుకొచ్చారు. శస్త్ర చికిత్స మొదలుపెట్టిన వైద్యులు పిల్లవాడికి ఆపరేషన్ ప్రారంభించి లోపల వున్న శిశువు పిండాన్ని చూసి షాక్ తిన్నారు. దాదాపు 2 గంటల పాటు ఆపరేషన్ చేసి పిండాన్ని తొలగించారు. 
 
బాలుడు గర్భం ధరించడమేమిటని అతడి తల్లిదండ్రులు వైద్యులను నిలదీశారు. దీనికి వారు సమాధానమిస్తూ... ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయనీ, తల్లి గర్భంతో వున్నప్పుడు ఈ బాలుడితోపాటు మరో పిండం కూడా ఏర్పడిందని తెలిపారు. ఐతే ఆ పిండం ఎదుగుదలలో తేడాలు రావడంతో అలాగే వుండిపోయి చివరికి ఆరోగ్యంగా ఎదిగిన మరో పిండం లోపలికి వెళ్లిపోయిందని అన్నారు. అలా ఏడేళ్ల కిందట ఈ పిల్లవాడు జన్మించాడని చెప్పారు. తొలుత దీన్ని అంగీకరించకపోయినా, గతంలో జరిగిన ఘటనలను వైద్యులు వారి ముందు వుంచేసరికి ఒప్పుకోక తప్పలేదు మరి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోదీకి నిస్సాన్ నోటీసులు.. రూ.5వేల కోట్లు చెల్లించలేదు..