దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో పేదలకు సాయం అందించేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారు. ఆహారం,ఆర్థిక చేయూత అందిస్తూ పెద్ద మనసు చాటుకుంటున్నారు.
ఇప్పటికే పలువురు సినీ,రాజకీయ, క్రీడా ప్రముఖులు విరాళాలు ప్రకటించగా ఇప్పుడు పలు కంపెనీలు, ట్రస్టులు కూడా ముందుకు వస్తున్నాయి.
కరోనాను కట్టడి చేసే పనిలో భాగంగా షిర్డీసాయి ట్రస్ట్ కూడా తమ వంతు సాయం ప్రకటించింది. రూ. 51 కోట్ల విరాళాన్ని మహారాష్ట్ర సీఎం సహాయ నిధికి అందజేస్తామని తెలిపింది.
ఆహారం, ఆశ్రయం కల్పించే కార్యక్రమాలు వీటిని ఇస్తున్నట్టుగా చెప్పింది. కరోనా బాధితుల సంఖ్యలో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది. మరోవైపు ప్రముఖ ఆటోమొబైల్ రంగ సంస్థ బజాజ్ రూ .100 కోట్ల మొత్తాన్ని ఇస్తున్నట్టు తెలిపింది.