కరోనా మెడికల్ పరీక్షనీ దెబ్బ కొట్టింది. దేశంలోని మెడికల్ కళాశాలల్లో ప్రవేశం కోసం నిర్వహించే నీట్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
షెడ్యూల్ ప్రకారం మార్చి 27న ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను విడుదల చేయాల్సి ఉంది. కరోనా కట్టడికి దేశం మొత్తం లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో మే 3న జరగాల్సిన నీట్ పరీక్ష వాయిదా పడింది. నీట్ పరీక్షకు మొత్తం 15,93, 452 మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశానికి ఏప్రిల్ 5-11వ తేదీ వరకు నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్ పరీక్షను ఇప్పటికే కేంద్రం వాయిదా వేసింది. దీంతో మే 17వ తేదీన నిర్వహించాల్సిన జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను కూడా అనివార్యంగా వాయిదా వేసే పరిస్థితి ఏర్పడింది.
జేఈఈ పరీక్షల షెడ్యూల్‌ను అనుసరించే మే 4వ తేదీ నుంచి రాష్ట్ర స్థాయిలో ఎంసెట్ షెడ్యూల్ ఖరారు చేశారు. ఆ పరీక్షలు వాయిదా పడడంతో ఎంసెట్ నిర్వహణపైనా అనుమానాలు తలెత్తుతున్నాయి.