Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రూ.రెండు కోట్లు పెట్టి లవర్ ని కొనేసింది.. ఎక్కడో తెలుసా?

Advertiesment
రూ.రెండు కోట్లు పెట్టి లవర్ ని కొనేసింది.. ఎక్కడో తెలుసా?
, గురువారం, 7 జనవరి 2021 (12:12 IST)
తన భర్తను ఓ భార్య అమ్ముకోగా.. అతని ప్రియురాలు రూ.రెండు కోట్లు పెట్టి  కొనుగోలు చేసిన ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... 
 
మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో నివసించే ఓ కుటుంబంలో ఈ ఘటన జరిగింది. భర్త పనిచేసే కార్యాలయంలోనే సదరు మహిళ పనిచేస్తుండడంతో వారి మధ్య చిగురించిన స్నేహం కాస్తా.. ప్రేమగా మారింది. దాంతో కుటుంబంపై శ్రద్ధ చూపడం లేదు. ఫలితంగా భార్యాభర్తల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి.

ఈ కారణంగా వారి పిల్లలు మానసికంగా ఎంతో కుంగిపోయారు. కుటుంబంలో ఇటువంటి ఘర్షణలతో తనతోపాటు తన చెల్లెళ్లపై కూడా ఎంతో ప్రభావం చూపిస్తున్నదని.. పెద్దకుమార్తె ఫ్యామిలీ కోర్టుకు లేఖ ద్వారా విన్నవించింది. ఈ సమస్య పరిష్కారానికై కోర్టు కౌన్సిలర్‌ సరిత రజని.. వారిమధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించారు.

పలుసార్లు కుటుంబ సభ్యులతోపాటు సదరు మహిళను కూడా కౌన్సిలింగ్‌కు పిలిచారు. అయినా వారిమధ్య ఘర్షణలు తగ్గడం లేదు. సదరు మహిళ ఆయనతోనే ఉంటానని భీష్మించుకుని కూర్చుంది. తన భర్తే కావాలనుకుంటే.. తన పిల్లలకు న్యాయం చేయాలని... మంచి భవిష్యత్తునివ్వడానికి ఆర్థికంగా అభయమివ్వాలని భార్య కోరింది.

అందుకు సదరు మహిళ ఒప్పుకుని.. 27 లక్షల రూపాయల నగదు, దాదాపు కోటిన్నర మేర విలువ చేసే తన డూప్లెక్స్‌ ఇంటిని కూడా వారికి ఇచ్చేందుకు అంగీకరించింది. చివరగా.. ఈ ఒప్పందానికి అందరూ ఒప్పుకోవడంతో..కథ సుఖాంతమైంది. తను ప్రేమించిన వ్యక్తి కోసం.. అతని భార్యా.. పిల్లల కోసం..తన జీవితకాల ఆదాయాన్ని ఇచ్చానని ప్రియురాలు తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాషింగ్టన్‌లో రణరంగం : ట్రంప్‌ అభిశంసనపై మంత్రివర్గం మంతనాలు!