రాష్ట్ర బహిష్కరణకు గురైన ఓ వ్యక్తి ఇపుడు దేశ హోం మంత్రిగా ఉండటం విచిత్రమని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను లక్ష్యంగా చేసుకుని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని అవినీతిపరులకు ముఠా నాయుకుడిగా శరద్ పవార్‌ను పోల్చుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై శరద్ పవార్ ఘాటుగా స్పందించారు. దేశంలోని అవినీతిపరులకు నేనొక ముఠా నాయుకుడిని అంటూ అమిత్ షా నాపై విమర్శలు చేశారు. కానీ, గతంలో ఓ కేసులో సుప్రీంకోర్టు అమిత్ షాను రెండేళ్ళు గుజరాత్ నుంచి బహిష్కరించింది. అలాంటి వ్యక్తి ఇపుడు దేశానికే హోంమంత్రిగా ఉండటం విచిత్రం అని శరద్ పవార్ వ్యాఖ్యానించారు.
చట్టాలను దుర్వినియోగం చేశారన్న కేసులో అమిత్ షాను సుప్రీంకోర్టు రెండేళఅలు బహిష్కరించింది నిజం కాదా, మన దేశం ఎలాంటి వ్యక్తుల చేతిలో ఉందో ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇంటువంటి వ్యక్తులు దేశాన్ని అవినీతి మార్గంలోనే నడిపిస్తారు అంటూ శరద్ పవార్ ధ్వజమెత్తారు. గతంలో సంచలనం సృష్టించిన సొహ్రబుద్దీన్ నకిలీ ఎన్‌కౌంటర్ కేసులో సుప్రీంకోర్టు అమిత్ షాను రెండేళ్ల పాటు గుజరాత్ నుంచి బహిష్కరించిన విషయం తెల్సిందే. ఈ అంశాన్నే శరద్ పవరా తాజాగా ఎత్తి చూపారు.