Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అడ్డూ అదుపూ లేకుండా పోతున్న మేల్ పిగ్స్.. మగాడిని మరో మగాడు రేప్ చేసేసాడు

దివంగత ప్రముఖ కవి, జర్నలిస్టు అరుణ్ సాగర్ ఏ సందర్భంలో మగాళ్లను మేల్ పిగ్స్ (మగ పందులు) అని ప్రతీకాత్మకంగా పలికాడో కానీ అక్షరాలా తాము ఆ పదానికి అసలైన అర్హులమేనని నిరూపించుకుంటూనే ఉన్నారు. పసిపిల్లల నుంచి పండు ముదుసళ్లవరకు ఎవరినీ వదలకుండా రేప్ చేస్తున

Advertiesment
అడ్డూ అదుపూ లేకుండా పోతున్న మేల్ పిగ్స్.. మగాడిని మరో మగాడు రేప్ చేసేసాడు
హైదరాబాద్ , మంగళవారం, 1 ఆగస్టు 2017 (01:52 IST)
దివంగత ప్రముఖ కవి, జర్నలిస్టు అరుణ్ సాగర్ ఏ సందర్భంలో మగాళ్లను మేల్ పిగ్స్ (మగ పందులు) అని ప్రతీకాత్మకంగా పలికాడో కానీ అక్షరాలా తాము ఆ పదానికి అసలైన అర్హులమేనని నిరూపించుకుంటూనే ఉన్నారు.  పసిపిల్లల నుంచి పండు ముదుసళ్లవరకు ఎవరినీ వదలకుండా రేప్ చేస్తున్న మన మహాళ్లు చివరికి ఎంత బరితెగించారంటే ఆడవాళ్లు సరిపోక చివరకు మగాళ్లపైనే పడుతున్నారు.
 
మైసూరు పెడదారి పట్టిన ఒక యువకుడు, మరో యువకునిపై అఘాయిత్యానికి ఒడిగట్టడం సంచలనం కలిగిస్తోంది. కర్ణాటక మైసూరు జిల్లాలోని హెచ్‌.డీ.కోట తాలూకాలోని నంజనయ్య కాలనీకి చెందిన మణి అనే వ్యక్తి.. అదే ప్రాంతానికి చెందిన రాచప్ప అనే యువకుడిని కూలీ పనులు ఇప్పిస్తానని నమ్మించి ఐదు రోజుల క్రితం వేరే ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో రాచప్ప మిన్నకుండిపోయాడు.
 
అయితే సొమవారం రాచప్ప తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రికి తరలించగా వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు లైంగిక దాడి జరిగినట్లు గ్రహించి విషయాన్ని రాచప్ప తల్లికి తెలిపారు. దీంతో నిర్ఘాంతపోయిన ఆమె సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న హెచ్‌.డీ.కోట తాలూకా పోలీసులు నిందితుడు మణిని అరెస్ట్‌ చేశారు.
 
మేల్ పిగ్స్...  బహుశా ఏ దేశంలోనూ మగాడి చెత్తబుద్దిని సూచించే ఇలాంటి పదాన్ని ఎవరూ సృష్టించలేదేమో.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే గుండు కొడతాయన్నాం.. నిజంగానే కొట్టాయి.. కోట్లాది చిన్న ఖాతాదారుల గుండె గుబేల్