పట్టాలు తప్పిన సేల్దా-అజ్మేర్ ఎక్స్‌ప్రెస్.. ఇద్దరి మృతి.. 26 మందికి గాయాలు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ వద్ద సేల్దా - ఆజ్మీర్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదం బుధవారం ఉదయం కాన్పూర్ వద్ద ఈ ప్రమాదం సంభవించింది. రైలులోని 14 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో 26 మంది
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ వద్ద సేల్దా - ఆజ్మీర్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదం బుధవారం ఉదయం కాన్పూర్ వద్ద ఈ ప్రమాదం సంభవించింది. రైలులోని 14 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో 26 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న సహాయబృందాలు ఘటనాస్థలికి హుటాహుటిన చేరుకుని సహాయచర్యలు చేపట్టారు.
కాన్పూర్ వద్ద జరిగి రైలు ప్రమాదం దురదృష్టకరమని రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు అన్నారు. రైలు ప్రమాదస్థలిలో పరిస్థితిని సమీక్షిస్తున్నామని.. అధికారులను ఘటనాస్థలికి వెళ్లాలని ఆదేశించినట్లు చెప్పారు. క్షతగాత్రులకు పరిహారం ఇస్తామని ప్రకటించారు.
హెల్ప్‌లైన్ నంబర్లు..
రైలు ప్రమాద వివరాలు తెలుసుకునేందుకు రైల్వేశాఖ హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేసింది.
099350 24350
097948 45953