ప్రధాని మోడీ పులిమీద స్వారీ చేస్తున్నారు.. నోట్ల రద్దుపై కేసీఆర్
నోట్ల రద్దు తర్వాత ప్రధాని నరేంద్ర మోడీతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. ఆ సమయంలో మీరు పులిమీద స్వారీ చేస్తున్నారనీ మోడీతో కేసీఆర్ అన్నారు. దీనికి మోడీ కాస్తంత భావోద్వేగానికిలోనై నో
నోట్ల రద్దు తర్వాత ప్రధాని నరేంద్ర మోడీతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. ఆ సమయంలో మీరు పులిమీద స్వారీ చేస్తున్నారనీ మోడీతో కేసీఆర్ అన్నారు. దీనికి మోడీ కాస్తంత భావోద్వేగానికిలోనై నోట్ల రద్దుపై తన భవిష్యత్ ప్రణాళికను వెల్లడించారని కేసీఆర్ చెప్పారు. నోట్ల రద్దుపై తనతో మోడీ ఏమన్నారో కేసీఆర్ వెల్లడించారు.
'నోట్ల రద్దు నిర్ణయం మంచిదే అయినా దానికి ముందస్తు కసరత్తు కొంత చేసి ఉంటే బాగుండేదని, అది చాలకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని నేను ఆయనతో అన్నాను. అప్పుడు ప్రధాని భావోద్వేగంతో నాతో మాట్లాడారు. తనను ఒక రాష్ట్రం ప్రజలు మూడుసార్లు ముఖ్యమంత్రిని చేశారని.. దేశ ప్రజలు తన వంటి సాధారణ వ్యక్తికి ప్రధానిగా అవకాశం ఇచ్చారని, వారి రుణం తీర్చుకోవడానికే అన్నీ ఆలోచించే నోట్ల రద్దు వంటి పెద్ద నిర్ణయం తీసుకొన్నానని ఆయన చెప్పారు.
కసరత్తు ఎక్కువ చేస్తే ఈ నిర్ణయం బయటకు లీక్ అవుతుందన్న ఉద్దేశంతో అటువంటి అవకాశం ఎవరికీ ఇవ్వకుండా చేయాల్సి వచ్చిందని మోడీ వివరించారు. నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు తాత్కాలికమేనని... తర్వాత ప్రజలకు, దేశానికి మంచే జరుగుతుందన్న అభిప్రాయంతో ప్రధాని ఉన్నారు.
మీరు పులి మీద స్వారీ చేస్తున్నారని కూడా నేను ఆయనతో అన్నాను. తాను అన్నింటికీ సిద్ధపడే ఈ నిర్ణయం తీసుకొన్నానని, దేశంలో అవినీతిని... నల్లధనాన్ని నిర్మూలించడానికి ఇది తప్పదని ఆయన చెప్పినట్టు కేసీఆర్ చెప్పుకొచ్చారు.
ఈ విషయాన్ని హైదరాబాద్‌లో ఉన్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గౌరవార్థం గవర్నర్ నరసింహన్ ఇచ్చిన విందుకు ఇద్దరు సీఎంలు హాజరయ్యారు. తన వద్దకు వచ్చిన అతిథులను పలకరించి వారితో ఫొటోలు దిగే పనిలో రాష్ట్రపతి ఉండటంతో ముఖ్యమంత్రులు ఇద్దరూ కొద్దిగా పక్కకు వచ్చి లోకాభిరామాయణం మాట్లాడుకొన్నారు. ఆ సమయంలో చంద్రబాబుకు కేసీఆర్ ఈ విషయాన్ని వెల్లడించినట్టు చెప్పారు.