ఇవి కొత్త నోట్లేనా... పిల్లలాడుకునే జాలీ నోట్లా...? బయటకొచ్చిన రూ. 50, రూ. 100 నోట్లు?
న్యూఢిల్లీ: కొత్త కరెన్సీ చూస్తే అందరికీ ఒకటే భావన. అసలు ఇది కరెన్సీలా లేదని, పిల్లలు ఆడుకునే జాలీ నోట్లలా ఉన్నాయని టాక్. అవును. గతంలో రిలీజ్ అయి... ఇపుడు రద్దయిన 500, 1000 నోట్లు గాని, ఇ
న్యూఢిల్లీ: కొత్త కరెన్సీ చూస్తే అందరికీ ఒకటే భావన. అసలు ఇది కరెన్సీలా లేదని, పిల్లలు ఆడుకునే జాలీ నోట్లలా ఉన్నాయని టాక్. అవును. గతంలో రిలీజ్ అయి... ఇపుడు రద్దయిన 500, 1000 నోట్లు గాని, ఇపుడు వాడుకలో ఉన్న వంద, యాభై నోట్లు గాని చాలా క్వాలిటీగా ఉంటాయి. చివరికి 10, 5 రూపాయల నోట్లు కూడా ఏళ్ళ తరబడి వాడుతున్నా... ఏంతోమంది చేతిలో నలుగుతున్నా... వాటికి ఉన్న ఆ క్వాలిటీ తగ్గదు. పొరపాటున పాత నోటు జేబులో ఉండిపోయి... వర్షంలో తడిసినా, వాషింగ్ మిషన్లో వేసేసి తిప్పినా... తర్వాత తీసి ఆరబెట్టుకుని, ఇస్త్రీ చేసి వాడుకునే అంత క్వాలిటీగా ఉండేవి.
కానీ, ఇపుడు వస్తున్న ఈ కొత్త నోట్లు చూస్తే, బాబోయ్ ఇదేం లో-క్వాలిటీ అనిపిస్తోంది. ఒక రకంగా అవి జాలీ నోట్లా అనే అనుమానం కలుగుతోంది. పేపర్ క్వాలిటీ లేదు... రంగు, టెక్ఛర్... ఇలా ఎందులోనూ క్వాలిటీ కనిపించడం లేదు. రు. 2000 నోటు పేరుకే గంభీరంగా ఉంది కానీ నోటులో ఆ దమ్ము లేదు. నోటు పలుచగా, ఏడాది లోపే చిరిగిపోయేలా కనిపిస్తోంది.
ఇంత నాణ్యత లేని నోట్లు ఎందుకు తయారుచేసినట్లా అని జనం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇపుడు కొత్తగా రిలీజ్ అవుతున్న వంద, యాభై నోట్లు చూసినా ఇదే ఫీలింగ్ కలుగుతోంది. అంతా మోదీ దయ, మన ప్రాప్తం అంటున్నారు... జనం. మరి ఈ నోట్లు వానలో తడిస్తే ఎలా ఉంటాయో...? ప్రస్తుతం ఈ నోట్లు వాట్స్ యాప్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. మరి ఈ నోట్లు నిజమైనవేనా అనేది తేలాల్సి ఉంది.