పెద్ద నోట్ల రద్దుపై నోరువిప్పిన అమీర్ ఖాన్.. నా సినిమాకు ఇబ్బంది కలిగినా పర్లేదు..
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ పెద్ద నోట్ల రద్దు వ్యవహారంలో జాగ్రత్తగా స్పందించాడు. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన పెద్దనోట్ల రద్దు వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి మద్దతు పలికాడు. అసహనంపై కామెంట్లు చేసి లేన
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ పెద్ద నోట్ల రద్దు వ్యవహారంలో జాగ్రత్తగా స్పందించాడు. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన పెద్దనోట్ల రద్దు వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి మద్దతు పలికాడు. అసహనంపై కామెంట్లు చేసి లేనిపోని తంటాలు కొనితెచ్చుకున్న అమీర్ ఖాన్.. పెద్ద నోట్ల రద్దుతో ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తాత్కాలికమేనని వ్యాఖ్యానించారు.
దేశ ప్రయోజనాల కోసం ఇలాంటి నిర్ణయాలు చాలా అవసరమని అమీర్ ఖాన్ వ్యాఖ్యానించాడు. ఒకవేళ ఈ నిర్ణయం కారణంగా తన సినిమాకు ఇబ్బంది కలిగినా తాను స్వాగతిస్తానని తెలిపాడు. నోట్ల రద్దు వల్ల తన సినిమాకు నష్టం వచ్చినా దాన్ని పెద్ద సమస్యగా చూడనని, అదో చిన్న విషయంగా భావిస్తానని అమీర్ అన్నారు. ఇకపోతే.. అమీర్ ఖాన్ లీడ్ రోల్‌లో దంగల్ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో ఉంది.
భారత రెజ్లర్ మహావీర్ ఫోగట్ జీవిత కథ ఆదారంగా తెరకెక్కిన ఈ సినిమా అమీర్ ఖాన్ రెండు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించనున్నాడు. అమీర్ ఖాన్ నలుగురు కూతుళ్లకు తండ్రిగా నటిస్తున్న దంగల్ సినిమా డిసెంబర్ 23న రిలీజ్ కానుంది.