Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పన్నీర్‌ సెల్వంను వెనకుండి నడిపించేది.. బీజేపీ కానే కాదట.. ఆ ఏడుగురేనట?

తమిళనాడు ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం తెరలేపిన రాజకీయ సంక్షోభానికి అసలు కారణం బీజేపీ కాదని తెలిసింది. బీజేపీనే పన్నీర్ సెల్వంను నడిపిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే పన్నీరు వెనక బీజే

Advertiesment
Sasikala
, సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (12:13 IST)
తమిళనాడు ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం తెరలేపిన రాజకీయ సంక్షోభానికి అసలు కారణం బీజేపీ కాదని తెలిసింది. బీజేపీనే పన్నీర్ సెల్వంను నడిపిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే పన్నీరు వెనక బీజేపీ లేదని.. ఆయన వెంట అన్నాడీఎంకే సీనియర్ నేతలున్నారని తెలిసింది.

వారి రాజకీయ అనుభవాన్నంతా రంగరించి శశికళపై రాజీలేని పోరాటం చేస్తున్నట్లు పన్నీర్ క్యాంప్ వర్గాల సమాచారం. వారు ఎవరంటే..? వి.మైత్రేయన్, కెపి మునుస్వామి, కె.పాండిరాజన్, నాథమ్ ఆర్.విశ్వనాథన్, పీహెచ్.పాండ్యన్, ఈ.మధుసూదనన్, సీపాండ్యన్‌లని పన్నీర్ క్యాంప్ వద్ద కార్యకర్తలు అనుకుంటున్నారు. ఈ ఏడుగురు పన్నీర్ సెల్వాన్ని సీఎం చేయాలని ఉవ్విళ్లూరుతున్నారట. 
 
అంతేగాకుండా పన్నీర్ నాయకత్వంలో అన్నాడీఎంకే నడవాలనుకుంటున్నట్లు సమాచారం. గవర్నర్‌తో సంప్రదింపులు, చర్చలకు సంబంధించిన అన్ని విషయాల్లో ఎలా ముందుకెళ్లాలనే విషయంలో వి.మైత్రేయన్ పన్నీరుకు అండగా నిలిచారు. శశికళ, ఆమె కుటుంబ సభ్యులకు సంబంధించి వెలుగులోకి తేవాల్సిన అన్ని విషయాలపై కెపి.మునుస్వామి కసరత్తు చేస్తున్నారు. ఇక వ్యాపారవేత్తగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కెపాండిరాజన్ కూడా ఎమ్మెల్యేలతో ఉన్న సత్సంబంధాల దృష్ట్యా పన్నీరు శిబిరంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.
 
పార్టీ అంతర్గత వ్యూహప్రతివ్యూహాలపై పన్నీరు తీసుకునే అన్ని నిర్ణయాల వెనుక నాథమ్ ఆర్.విశ్వనాథన్ ఉంటారు. అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేసిన అనుభవం ఉండటంతో పీహెచ్ పాండ్యన్ తనకు రాజ్యాంగపరంగా ఎదురయ్యే సమస్యల నుంచి గట్టెక్కించగలడని పన్నీరు నమ్ముతున్నారు. అన్నాడీఎంకేలో సుదీర్ఘ అనుభవం ఉన్న నేతగా ఈ. మధుసూదన్ గురించి ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన తన పలుకుబడితో.. పన్నీరును సీఎం చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు పన్నీర్ క్యాంప్ వద్ద జోరుగా ప్రచారం సాగుతోంది.
 
న్యాయపరమైన విషయాలను డీల్ చేయడంలో అన్నాడీఎంకేలో సి.పొన్నయన్‌ను మించిన వారు లేరు. ఎంజీఆర్, జయలలిత ప్రభుత్వాన్ని లీడ్ చేసిన సమయంలో దాదాపు 16 సంవత్సరాలు ఆయన న్యాయశాఖా మంత్రిగా పనిచేశారు. ఇంకా ఈ ఏడుగురిని తన వైపు తీసుకొచ్చేందుకు పన్నీర్ చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయని రాజకీయ పండితులు చెప్తున్నారు. మరి బలపరీక్షలో పన్నీర్ ఏవిధంగా పైచేయి సాధిస్తారో వేచి చూడాల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మ చనిపోయాక ప్రమాణం చేశాను.. పన్నీరు పార్టీని నాశనం చేయాలని?: శశికళ