అన్నాడీఎంకేలో కొత్త ట్విస్ట్ : సీఎం అభ్యర్థిగా శశికళ ఔట్.. తెరపైకి మరోనేత?
అన్నాడీఎంకేలో కొత్త ట్విస్ట్. ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా శశికళ పేరుకు బదులుగా మరో అభ్యర్థి నేత పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతమున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మరోమారు ముఖ్యమంత్రి కాకుండా
అన్నాడీఎంకేలో కొత్త ట్విస్ట్. ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా శశికళ పేరుకు బదులుగా మరో అభ్యర్థి నేత పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతమున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మరోమారు ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా శశికళ పావులు కదిపారు. ఫలితంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా పార్టీ సీనియర్ నేత కేఏ సెంగోట్టయ్య పేరును తెరపైకి తెచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ పేరును మన్నార్గుడి మాఫియా ప్రతిపాదించినట్టు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి అవడానికి యత్నిస్తున్న శశికళపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేఖత వ్యక్తమవుతున్న నేపథ్యంలో మన్నార్గుడి వర్గం ఈ కొత్త పేరును ప్రతిపాదించింది. ప్రజా వ్యతిరేకత కొంత తగ్గేంతవరకు కేఏ.సెంగోట్టయ్యన్‌ను సీఎంగా కొనసాగించాలని శశికళ వర్గం ఈ అనూహ్య నిర్ణయాన్ని తీసుకుంది. అయితే, సెంగోట్టయ్యన్‌కు ఎంతమంది నేతలు మద్దతు ఇస్తారో లేదో వేచి చూడాల్సిందే.