Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అన్నా డీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి పోటీపడతా : అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప

అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి తాను పోటీ చేయనున్నట్టు ఆ పార్టీ బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప తెలిపారు. ఆ పార్టీ అధినేత జయలలిత మరణం తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి ఆమె స్నేహితురాలు శశిక

Advertiesment
అన్నా డీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి పోటీపడతా : అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప
, శుక్రవారం, 23 డిశెంబరు 2016 (12:11 IST)
అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి తాను పోటీ చేయనున్నట్టు ఆ పార్టీ బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప తెలిపారు. ఆ పార్టీ అధినేత జయలలిత మరణం తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి ఆమె స్నేహితురాలు శశికళ పోటీ పడుతున్నారు. ఇదే పదవికి తాను కూడా పోటీ చేనయున్నట్టు ఆమె ప్రకటించారు. 
 
ఇదే అశంపై శశికళ చెన్నైలో మాట్లాడుతూ... పార్టీ నుంచి తనను బహిష్కరించలేదని గుర్తు చేశారు. ఏఐఏడీఎంకే ఎంపీగా కొనసాగుతున్నానని తెలిపింది. జయలలిత నెచ్చెలి శశికళ నటరాజన్‌‌కు వ్యతిరేకంగా శశికళ పుష్ప తీవ్ర ఆరోపణలు చేశారు. జయలలితను చంపేందుకు శశికళ నటరాజన్‌ ప్రయత్నించారని, దీనిపై విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు.
 
కాగా, పార్టీ పగ్గాలు చేపట్టాలని అంతా శశికళను కోరుతున్నారన్న వార్తల నడుమ, తాను కూడా పోటీలో ఉన్నానని శశికళ పుష్ప ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. ఇది శుక్రవారం వెలువడే మద్రాస్ హైకోర్టు తీర్పుపై ఆధారపడి ఉంటుందని ఆమె తెలిపారు. 75 శాతం మంది కార్యకర్తలు పార్టీ పగ్గాలు ఆమెకు అప్పగించేందుకు సముఖత వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కర్ణాటకలోని ఉద్యోగాలన్నీ కన్నడిగులకేనట : సీఎం సిద్ధరామయ్య కొత్త ఎత్తుగడ