కర్ణాటకలోని ఉద్యోగాలన్నీ కన్నడిగులకేనట : సీఎం సిద్ధరామయ్య కొత్త ఎత్తుగడ
దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న అతిపెద్ద రాష్ట్ర కర్నాటక, ఆ పార్టీకి పట్టుకొమ్మగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజన పేరుతో పోగొట్టుకుంది. పైగా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్
దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న అతిపెద్ద రాష్ట్ర కర్నాటక, ఆ పార్టీకి పట్టుకొమ్మగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజన పేరుతో పోగొట్టుకుంది. పైగా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైపోయింది. ఈ నేపథ్యంలో కర్నాటకలో తమ ప్రాబల్యాన్ని నిలబెట్టుకునేందుకు, కాపాడుకునేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ఆ రాష్ట్ర ముఖ్యమమంత్రి సిద్ధరామయ్య (కాంగ్రెస్) సరికొత్త ఎత్తుగడ వేశారు. మరో యేడాదిన్నర కాలంలో కర్నాటక రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్నాయి. అందుకే ఈ సరికొత్త ఎత్తుగడ వేశారు. రాష్ట్రంలోని అన్ని ఉద్యోగాలు స్థానికులకే కేటాయించాలన్న నినాదాన్ని తలకెత్తుకోనున్నాడు. ఇదే జరిగితే ఇకపై ఉద్యోగాల కోసం కన్నడిగులు తప్ప మరెవరూ బెంగళూరూకు వెళ్లే అవకాశం ఉండదు.
నిజానికి దేశ ఐటీ కేంద్రంగా బెంగుళూరు విరాజిల్లుతోంది. ఈ మహానగరంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు.. ముఖ్యంగా రాయలసీమ వాసులు ఏ చిన్న ఉద్యోగం కావాలన్నా బెంగళూరుకే వెళ్తున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల వారు కూడా కర్ణాటకకు వస్తుంటారు. దీనికి కారణం బెంగళూరులో ఐటీతో పాటు ఇతర పరిశ్రమలు కూడా విపరీతంగా ఉండడమే. చదువురాని వాళ్లకు కూడా ఏదో ఒక కంపెనీలో సులభంగా పని దొరుకుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ బెంగళూరు వెళ్లేందుకు ఇష్టపడతారు. అక్కడ వాతవరణం కూడా అనుకూలంగా ఉండడంతో బెంగళూరు అందరినీ ఆకర్షిస్తోంది. ఈ ఆకర్షణకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బ్రేక్ వేయబోతున్నారు.