జగన్ మంచోడు.. నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీడీపీలో చేరుతున్నా : ఉప్పులేటి కల్పన
వైఎస్.జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపాకు చెందిన మరో ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన అధికార టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆమె టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.
వైఎస్.జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపాకు చెందిన మరో ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన అధికార టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆమె టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునేందుకే తాను టీడీపీలోకి చేరుతున్నట్టు తెలిపారు. ప్రతిపక్షంలో ఉంటే నిధుల కొరత ఉంటుందన్నారు. రాష్ట్రంలో పామర్రు నియోజకవర్గాన్ని తొలి స్థానంలో నిలపడమే తన ఆకాంక్షమని తెలిపారు.
వైసీపీ పార్టీ విధానాలకు అనుగుణంగానే గతంలో టీడీపీపై విమర్శలు చేశానని... వ్యక్తిగతంగా ఎవరినీ కించపరిచే ఆలోచన తనకు లేదని చెప్పారు. తనతో పాటు 30 మంది సర్పంచ్‌లు, 20 మంది ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, మరి కొందరు నేతలు టీడీపీలో చేరుతారని చెప్పారు.
టీడీపీ అధినేత చంద్రబాబు తనకు ఎలాంటి బాధ్యతలను అప్పగించినా... నిర్వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. కాగా, ఈమె కృష్ణా జిల్లా పామర్రు అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహించారు.