ఆలయాల్లో మహిళల అంగాంగ ప్రదర్శనలు.. చూసి ఆనందిస్తున్న పురుషులు..
కేరళ రాష్ట్రానికి సీపీఎం ఎంపీ పీకే శ్రీమతి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. హిందూ మహిళలు తడిసిన దుస్తుల్లో ఆలయాలకు వెళ్లేంది అక్కడున్న పురుషులకు తమ అంగాంగాలను ప్రదర్శించేందుకేనంటూ వ్యాఖ్యానించారు.
కేరళ రాష్ట్రానికి సీపీఎం ఎంపీ పీకే శ్రీమతి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. హిందూ మహిళలు తడిసిన దుస్తుల్లో ఆలయాలకు వెళ్లేంది అక్కడున్న పురుషులకు తమ అంగాంగాలను ప్రదర్శించేందుకేనంటూ వ్యాఖ్యానించారు. ఈ అంగాంగ ప్రదర్శనను ఆలయాలకు వెళ్లే పురుషులు చూసి ఆనందిస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
శబరిమల పుణ్యక్షేత్రంలో మహిళలకు ప్రవేశం కల్పిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు కేరళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈనేపథ్యంలో లెఫ్ట్ పార్టీల నేతలు ఈ తీర్పును తప్పుబడుతుంటే సంఘ్ పరివార్ సంస్థలు మాత్రం స్వాగతిస్తున్నాయి.
ఈపరిస్థితుల్లో కేరళ రాష్ట్ర సీపీఎం ఎంపీ శ్రీమతి మాట్లాడుతూ, హిందూ మహిళలు కోనేర్లలో స్నానం చేసి తడిసిన దుస్తులతో ఆలయాల్లోకి వెళ్లేది అక్కడున్న పురుషులకు తమ అంగాంగాలను ప్రదర్శించేందుకే. ఆ దృశ్యాలను చూసి ఆనందించేందుకే మగవాళ్లూ ఆలయాలకు వెళ్తున్నారని వ్యాఖ్యానించారు.
ముఖ్యంగా, శబరిమల తీర్పును అడ్డుపెట్టుకొని ఆరెస్సెస్, కాంగ్రెస్, బీజేపీలు కలిసి కేరళ ప్రభుత్వం, సీఎం విజయన్‌పై తిరుగుబాటుకు కుట్ర పన్నుతున్నాయి. సమానత్వ హక్కును ఏ ఒక్కరూ కాదనలేరు. సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పును అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుందన్నారు.
అదేసమయంలో కమ్యూనిస్టు పార్టీ కేరళలో అనేక సామాజిక దురాచారాలను రూపుమాపింది. గతంలో 41 రోజుల దీక్ష ముగిసిన తర్వాత అయ్యప్ప భక్తులు కాళ్లకు చెప్పుల్లేకుండా శబరి కొండకు వచ్చేవారు. కానీ, ప్రస్తుతం చెప్పులు ధరించి వెళ్లేవారిని ఎంతో మందిని చూస్తున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.