Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నవంబర్​ నెలాఖరు వరకు అవే నిబంధనలు

నవంబర్​ నెలాఖరు వరకు అవే నిబంధనలు
, మంగళవారం, 27 అక్టోబరు 2020 (18:58 IST)
అన్​లాక్​-6 కొత్త నిబంధనలను కేంద్రం విడుదల చేసింది. కరోనా మహమ్మారి విస్తరణ కొనసాగుతున్నందున సెప్టెంబర్‌ 30న ఇచ్చిన ఆదేశాలను మరో నెల రోజులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర హోంశాఖ. అవేమంటే...
 
★ కరోనా విస్తరణ ఇంకా కొనసాగుతున్నందున జాగ్రత్తగా ఉండాల్సిందేనని కేంద్రం సూచించింది.
 
★ కంటైన్మెంట్‌ జోన్లలో అన్ని రకాల ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది హోంశాఖ. 
 
★ కంటైన్మెంట్‌ జోన్ల బయట... దాదాపు అన్ని రకాల కార్యకలాపాలకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. 
 
★ కంటైన్మెంట్‌ జోన్ల బయట రాష్ట్రాలు లాక్​డౌన్​ విధించకూడదని తాజా మార్గదర్శకాల్లో చెప్పింది కేంద్రం.
 
అన్​లాక్​-6 నిబంధనలు..
 
★ సామాజిక, క్రీడా, విద్యా, వినోద, సాంస్కృతిక, రాజకీయ సమావేశాలకు 200 మంది వరకు హాజరయ్యేందుకు అవకాశం.
 
★ కరోనాను ఎదుర్కోవడానికి ఈ నెల 8న ప్రధాని ప్రారంభించిన 'జన ఆందోళన్​'లో భాగస్వాములు కావడం.
 
★ మాస్క్‌లు ధరించడం, చేతులు తరచూ శుభ్ర పరుచుకోవడం, కనీసం ఆరు అడుగుల భౌతిక దూరాన్ని పాటించాలి.
 
★ ఈ మూడు పాటించేందుకు అవసరమైన ప్రచారం కల్పించాలని, క్షేత్రస్థాయిలో ప్రజలకు అర్థమయ్యే రీతిలో ప్రచారం చేపట్టాలని ఇప్పటికే అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు హోంశాఖ ఆదేశించింది.
 
★ రాష్ట్రాల మధ్య రాకపోకలకు ప్రభుత్వాలు ఎటువంటి అంతరాయం కల్పించకూడదు.
 
★ 10ఏళ్ల లోపు పిల్లలు, 65 ఏళ్లు దాటిన పెద్దలు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు, గర్భిణులు అత్యవసరం అయితేనే బయటికి రావాలి.
 
★ అంతర్జాతీయ ప్రయాణికులు, ఈత కొలనులు, వ్యాపార సమావేశాలు, వ్యాపార సంబంధిత ఎగ్జిబిషన్లు, సినిమా హాళ్లలో 50 శాతం వరకు అవకాశం కల్పిస్తూ.. సెప్టెంబర్‌ 30 ఆదేశాలు ఇచ్చిన కేంద్ర హోం శాఖ.. ఇవే ఆదేశాలు నవంబర్ నెలాఖరు వరకు కొనసాగుతాయని పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్ విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రయాణికులకు ఈ-బోర్డింగ్