Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమ్మాయితో విహారయాత్రకు వెళ్లాడు.. ఇపుడు ఖర్చులు ఇవ్వాలని కోర్టుకెక్కాడు.. ఎక్కడ?

Advertiesment
Russian man
, శనివారం, 4 జూన్ 2016 (13:01 IST)
సాధారణంలో అమ్మాయిలని బయటికి, షికార్లకి తీసుకెళ్లేటప్పుడు అబ్బాయిలే ఖర్చుపెడుతుంటారు. కానీ రష్యాలో ఓ యువతికి మాత్రం ఓ యువకుడు చుక్కలు చూపించాడు. ఓ కుర్ర లాయర్ను ప్రేమించిన పాపానికి ఆ అమ్మాయి కోర్టుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతోంది. ఇంతకీ అసలు విషయం తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.... 
 
రష్యాలోని క్రాస్నోయార్క్ప్కు ప్రాంతానికి చెందిన అమ్మాయి జుర్స్కోయా. కొద్దిరోజుల క్రితం ఓ కుర్ర లాయర్‌ని తొలిచూపులోనే ఇష్టపడింది. ఈ క్రమంలో అతనిపై మనసు పారేసుకుంది. అతడులేకుంటే బతకలేని స్థితి ఏర్పడింది జుర్స్కోయాకి. కాగా.. లాయర్తో కలిసి సరదాగా గడిపేందుకు క్రిమియాకు వెళ్లింది. అయితే ఆ విహారయాత్రలో యువ లాయర్ తనకు ప్రపోజ్ చేస్తాడని, తన మనసులోని మాటను కూడా అతనికి చెప్పొచ్చని ఎన్నో ఆశలు పెట్టుకుంది. 
 
కానీ ఆమె ఆశలన్నీ అడియాశలయ్యాయి. అతను ప్రపోజ్ చేయకపోవటంతో విచారంతో ఇంటికి చేరింది. ఆ తర్వాతే మొదలైంది అసలు ట్విస్ట్. అసలే ప్రేమ విఫలమైందన్న బాధలో కుంగిపోయున్న ఆమెకు కోర్టు నుంచి సమన్లు వచ్చాయి. అవి ఏంటా అని తీసి చూస్తే.. విహారయాత్రలో బొకేలకు.. రెస్టారెంట్లకు చేసిన ఖర్చులు సుమారు రూ.40 వేలు తనకు చెల్లించాలంటూ ఆ కుర్రలాయర్ సమన్లు పంపాడు. 
 
రెస్టారెంట్ బిల్లులు, కాఫీ షాప్ బిల్లులతో పాటు అన్ని బిల్లులను పక్కాగా కోర్టులో సమర్పించి మరీ తనకు రావాల్సిన మొత్తాన్ని వసూలు చేసుకోవాలని భావించాడు లాయర్.  పేరు వెల్లడించని ఆ లాయర్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ''మా ఇద్దరి మధ్య ప్రేమా లేదు దోమా లేదు.. మేం సరదాగా విహార యాత్రకు వెళ్లాం. ఖర్చులు మొత్తం నేనే భరిస్తానని నేను ఆమెతో చెప్పలేదు. అందుకే నాకు రావాల్సిన మొత్తాన్నికోర్టు ద్వారా తిరిగి తీసుకుంటున్నాను'' అని చెబుతున్నాడు. నిజంగా విచిత్రంగా ఉంది కదూ...

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుపతిని వరల్డ్ క్లాస్‌ రైల్వేస్టేషన్‌ చేయాలి : తితిదే ఛైర్మన్‌ చదలవాడ