Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుపతిని వరల్డ్ క్లాస్‌ రైల్వేస్టేషన్‌ చేయాలి : తితిదే ఛైర్మన్‌ చదలవాడ

Advertiesment
Tirupati
, శనివారం, 4 జూన్ 2016 (12:34 IST)
ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన తిరుపతి రైల్వేస్టేషన్‌ను వెంటనే వరల్డ్ క్లాస్‌ రైల్వేస్టేషన్‌ చేయాలని కేంద్రరైల్వేమంత్రి సురేష్ ప్రభుని తితిదే పాలకమండలి ఛైర్మన్‌ చదలవాడ క్రిష్ణమూర్తి కోరారు. ఎన్నో యేళ్లుగా వరల్డ్ క్లాస్‌ రైల్వేస్టేషన్‌  ప్రతిపాదన ఉందని, అయితే ఇప్పటి వరకు ఆచరణలో పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సుదూర ప్రాంతాల నుంచి వేలమంది భక్తులు ప్రతిరోజు తిరుపతికి వస్తుంటారని, అలాంటి రైల్వేస్టేషన్‌లో పూర్తిస్థాయిలో సౌకర్యాలు లేవన్నారు. ఉన్న ఎస్కలేటర్‌లో ఒకటి పనిచేయడం లేదని, అలాగే డార్మెటరీలు ప్రయాణీకులకు సరిపోవడం లేదని, ఫ్లాట్‌ ఫాంలు ఐదు మాత్రమే ఉన్నాయని, మరో రెండు ఏర్పాటు చేయాలని కోరారు. 
 
శనివారం తిరుచానూరు క్రాసింగ్‌ స్టేషన్‌కు ఆయన శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ రాజధానికి నేరుగా ఒక రైలును తిరుపతి నుంచి వేయాలని, అమరావతికి వెళ్ళాలంటే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని, వెంటనే తిరుపతి నుంచి ప్రత్యేక రైలును వేయాలని కోరారు. అలాగే చెన్నై నుంచి తిరుపతికి తిరుపతి నుంచి చెన్నైకు ప్రతిరోజు ఒక రైలును వేయాలని కోరారు. రాత్రి వేళల్లో మెరుగైన వైద్యంతో పాటు మిగిలిన అవసరాల నిమిత్తం ఖచ్చితంగా రాత్రి వేళల్లో తిరుపతి చెన్నై రైలు వేయాలని కోరారు.  
 
ఇజ్జత్‌ టికెట్లను పునరుద్ధరించండి.. చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ 
చిరువ్యాపారులకు ఎంతగానో అవసరమయ్యే ఇజ్జత్‌ టికెట్లను వెంటనే పునరుద్ధరించాలని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు శివప్రసాద్‌ కేంద్ర రైల్వేమంత్రిని కోరారు. ఆరు రైల్వే బడ్జెట్‌లు చూసి బాధపడ్డానని.. అయితే ఏడో బడ్జెట్‌ చూసిన తర్వాత ఏపీని న్యాయం జరిగిందన్న నమ్మకం వచ్చిందన్నారు.  ఏపీలోని రైల్వేస్టేషన్లను మరింత అభివృద్ధి చేయాలని ఆయన కోరారు. 
 
69 యేళ్లుగా ఏపీ నుంచి రైల్వేమంత్రి ఒక్కరూ లేరు..  మురళీమోహన్‌ 
69 యేళ్ళుగా ఏపీ నుంచి ఒక్కరు కూడా రైల్వేమంత్రి కాలేదని రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ అన్నారు. కానీ, తొలిసారి ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తూ రైల్వేశాఖామంత్రిగా సురేష్‌ ప్రభు కొనసాగుతున్నారని, ఇది ఒక శుభపరిణామమని, ఖచ్చితంగా ఏపీలోని రైల్వేస్టేషన్లన్నీ అభివృద్థి చెందుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఏపీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సురేష్ ప్రభుకు తిరుపతిని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఆయనదేనన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యూపీలో ఎస్పీ సహా 24 మంది మృతి.. మధురలో రక్తసిక్తానికి కారణం ఏమిటంటే?