Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్పీకర్‌పై దాడి.. 12మంది బీజేపీ ఎమ్మెల్యేలపై ఏడాది పాటు బహిష్కరణ వేటు

Advertiesment
స్పీకర్‌పై దాడి.. 12మంది బీజేపీ ఎమ్మెల్యేలపై ఏడాది పాటు బహిష్కరణ వేటు
, సోమవారం, 5 జులై 2021 (20:15 IST)
Maharastra
మహారాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గందరగోళం మధ్య సోమవారం ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ పోడియం వద్దకు ప్రతిపక్ష బీజేపీ సభ్యులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి.

దీంతో స్పీకర్ సభను వాయిదా వేశాయి. ఈ సమయంలో ఆయన ఛాంబర్‌లోకి వెళ్లిన ప్రతిపక్ష సభ్యులు.. స్పీకర్‌పై దాడికి ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ఆయన్ను నోటికొచ్చినట్టు దుర్భాషలాడినట్టు సమాచారం.
 
రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న వ్యక్తిని కించపరిచేలా వ్యవహరించారని, 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఏడాది పాటు బహిష్కరిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. ఈ 12 మంది సభ్యులు స్పీకర్‌పై దాడిచేసే సమయంలో ప్రతిపక్ష నేత, మాజీ సీఎం ఫడ్నవీస్ కూడా అక్కడే ఉండటం గమనార్హం. 
 
అయితే, ఈ ఆరోపణలను ఫడ్నవీస్ ఖండించారు. ఇవన్నీ తప్పుడు ఆరోపణలు.. కల్పిత కథనాలు సృష్టించారు.. బీజేపీ సభ్యులెవరూ స్పీకర్‌ను కించపరచలేదని ఫడ్నవీస్ మీడియాతో అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో భారీగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు