భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చేలా ఆయన మంగళవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో కలిశారు. ముంబైలోని సీఎం అధికారిక నివాసమైన వర్షలో వీరిద్దరి మధ్య మర్యాదపూర్వక భేటీ జరిగింది. ఈ విషయాన్ని దేవేంద్ర ఫడ్నవిస్ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించింది.
భారత క్రికెటర్ రోహిత్ శర్మను నా అధికారిక నివాసం వర్షలో కలవడం, మాట్లాడటం సంతోషంగా ఉంది. టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న ఆయనకు తదుపరి ప్రయాణంలో విజయం సాధించాలని నా శుభాకాంక్షలు తెలియజేశాను అని పేర్కొంటూ రోహిత్‌తో దిగిన ఫోటోలను పంచుకున్నారు.
సీఎంతో రోహిత్ భేటీ, ఆపై ఫోటోలు బయటకు రావడంతో రోహిత్ రాజకీయాల్లోకి ప్రవేశించబోతున్నాడన్న ఊహాగానాలు మొదలయ్యాయి. సోషల్ మీడియా మొత్తం ఇదే చర్చలో మునిగిపోయింది. అయితే, ఈ వార్తలకు ఎలాంటి అధికారిక ధృవీకరణ లభించలేదు.