Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సుప్రీంకోర్టు 52వ సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్

Advertiesment
br gavai

ఠాగూర్

, బుధవారం, 14 మే 2025 (12:48 IST)
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయి (బీఆర్ గవాయి) బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేయించారు. ఈ నియామకంతో జస్టిస్ గవాయి భారతదేశానికి 52వ  ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టినట్టయింది. దేశ అత్యున్నత న్యాయస్థానానికి సారథ్యం వహించనున్న జస్టిస్ గవాయి నియామకంలో ఒక చారిత్రక విశేషం ఉంది. భారత న్యాయవ్యవస్థ చరిత్రలో ప్రధాన న్యాయమూర్తి పదవి అలంకరించిన తొలి బౌద్ధమతస్థుడిగా ఆయన గుర్తింపుపొందారు. 
 
శత్రువును నట్టింటికి వెళ్లి తన్నివచ్చాం : ప్రధాని మోడీ 
 
మన మహిళల సిందూరం తుడిసివేసిన వారి నట్టింటికి వెళ్లి నాశనం చేశామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. పంజాబ్ రాష్ట్రంలోని అదంపూర్ వైమానిక స్థావరాన్ని ఆయన మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎయిర్ బేస్ ఉన్నతాధికారులు, సైనికులతో ఆయన ముచ్చటించారు. ఆ తర్వాత వారిని ఉద్దేశించి ప్రసంగించారు. భారత్ మాతాకీ జై అనే నినాదం శత్రువుల చెవుల్లో గింగిరాలు తిరుగుతోందని ప్రధాని మోడీ అన్నారు. 
 
మన సైన్యం చూపిన శక్తిసామర్థ్యాలకు ఎన్ని ప్రశంసలు చేసినా తక్కువే. అణు బెదిరింపులను అపహాస్యం చేసింది. భారత శక్తి సామర్థ్యాలను చూసి నా జీవితం ధన్యమైంది. యుద్ధక్షేత్రంలోనూ భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశాం. ఆకాశం నుంచి పాతాళం వరకు ఆ నినాదం మార్మోగుతోంది. ఈ భూమి నుంచి వీర సైనికులు అందరికీ సెల్యూట్ చేస్తున్నా.. మీ పరాక్రమంతో ఆపరేషన్ సిందూర్ నిదానం ప్రపంచమంతా మార్మోగుతోంది. 
 
ప్రతీ భారతీయుడు సైన్యానికి మద్దతుగా నిలబడ్డాడు. భారత నేలకు కృతజ్ఞతలు చెప్తున్నాడు. ధర్మసంస్థాపన కోసం ఆయుధం పట్టడం మన సంప్రదాయం. మన విధానం. మన అక్కాచెల్లెళ్లు నుుదటి సిందూరం తుడిచినవారి నట్టింట్లోకి వెళ్లి నాశనం చేశాం.. అని ప్రధాని ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Pawan Kalyan: చిత్తూరు జిల్లాలో అటవీ భూములను ఆక్రమించారు.. పవన్ సీరియస్