Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లేడీ టీచర్ కుర్చీ కింద బాంబు అమర్చి రిమోట్‌తో పేల్చిన విద్యార్థులు.. ఎక్కడ?

Advertiesment
teacher - bomb

ఠాగూర్

, ఆదివారం, 17 నవంబరు 2024 (14:40 IST)
హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగింది. కొందరు పోకిరీ విద్యార్థులు అమానవీయంగా ప్రవర్తించారు. తమకు చదువు చెప్పే ఉపాధ్యాయురాలి కుర్చీ కింద బాంబు పెట్టి, రిమోట్‌తో పేల్చారు. ఈ ఘటనలో అదృష్టవశాత్తు ఆ టీచర్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలోని ఓ పాఠశాలలో వెలుగు చూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హర్యానాలోని ఓ పాఠశాలలో 12వ తరగతి విద్యాభ్యాసం చేసే కొందరు విద్యార్థులను సైన్స్ పాఠాలు బోధించే మహిళా టీచర్ తిట్టారు. అల్లరి పనులుమాని చదువుపై దృష్టిసారించాలని హితవు పలికారు. ఈ వ్యాఖ్యలు విద్యార్థులకు ఏమాత్రం రుచించలేదు. తరగతి గదిలో తమను అవమానించిన టీచర్‌పై విద్యార్థులు ద్వేషం పెంచుకున్నారు. యూట్యూబ్‌లో వీడియోలు చూసి బాణాసంచాతో బాంబు తయారు చేసి, దానిని టీచర్ కుర్చీ కింద అమర్చారు. టీచర్ క్లాస్ రూంలోకి వచ్చి ఆ కుర్చీలో కూర్చొన్న తర్వాత రిమోట్ సాయంతో బాంబును పేల్చారు. 
 
ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో స్కూలు మొత్తం ఉలిక్కిపడింది. ఈ పేలుడు ధాటికి కుర్చీ దెబ్బతింది. అయితే, అదృష్టవశాత్త టీచర్‌ మాత్రం ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటనపై మండిపడిన ప్రిన్సిపాల్.. ఈ పనికి పాల్పడిన విద్యార్థులందరినీ సస్పెండ్ చేసి, విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.25 లక్షలు లంచం పుచ్చుకుంటూ పట్టుబడిన డీఆర్ఎం సౌరభ్ ప్రసాద్