Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిన్నమ్మా మజాకా..? ప్రజల కోసం లేఖాస్త్రం.. పొంగల్‌ రోజున ఐచ్ఛిక సెలవా? ''సెల్లాదు.. సెల్లాదు''!

తమిళనాట అన్నాడీఎంకే సారథిగా శశికళ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానికి తర్వాత ఆమె స్థానంలో కూర్చున్న శశికళ.. అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తల నుంచి అసంతృప్తి ఎదుర్కొంటున్నారు. ఇంకా ప్రజల్లోనూ కాస్త అసంతృప్తి సెగను చల్

చిన్నమ్మా మజాకా..? ప్రజల కోసం లేఖాస్త్రం.. పొంగల్‌ రోజున ఐచ్ఛిక సెలవా? ''సెల్లాదు.. సెల్లాదు''!
, మంగళవారం, 10 జనవరి 2017 (14:38 IST)
తమిళనాట అన్నాడీఎంకే సారథిగా శశికళ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానికి తర్వాత ఆమె స్థానంలో కూర్చున్న శశికళ.. అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తల నుంచి అసంతృప్తి ఎదుర్కొంటున్నారు. ఇంకా ప్రజల్లోనూ కాస్త అసంతృప్తి సెగను చల్లార్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా పొంగల్ (సంక్రాంతి) పండుగనే అస్త్రంగా తీసుకోనున్నారు. ఇప్పటికే 11, 12 తేదీల్లో శశికళ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే ఛాన్సుందని వార్తలొస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో చిన్నమ్మ శశికళ రాజకీయంగా పావులు కదుపుతూనే తమిళ ప్రజల మనస్సులను దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లున్నారు. పొంగల్ సెలవు దినంపై శశికళ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి హోదాలో కేంద్రానికి లేఖ రాశారు. పొంగల్ సెలవు దినాన్ని తప్పనిసరి సెలవుగా కాకుండా ఐచ్ఛిక సెలవు దినంగా ప్రకటించాలనే కేంద్ర ప్రభుత్వ ఆలోచనపై ఆయన లేఖాస్త్రం సంధించారు. ఐచ్ఛిక సెలవు దినంగా ప్రకటించే నిర్ణయంపై పునరాలోచన చేయాలని ఆమె కేంద్రాన్ని కోరారు. కేంద్ర నిర్ణయం పొంగల్ పర్వదినానికి పెద్ద షాక్ అన్నారు. 
 
తమిళనాడులోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పొంగల్ రోజున సెలవు దినంగా ఉండేదనే విషయాన్ని కూడా శశికళ లేఖలో గుర్తు చేశారు. పొంగల్ పండుగను అన్ని కులాలు, మతాల వారు జరుపుకుంటారని.. అందుకే ఈ పండుగను ఉత్సాహంతో జరుపుకునేందుకు ప్రజలకు సెలవు ఇవ్వడం మంచిదని ఆ లేఖలో పేర్కొన్నారు. 
 
ఈ ఏడాది పొంగల్ శనివారం వస్తున్నప్పటికీ ఆ పండుగను కేంద్రం గౌరవించి, తప్పనిసరి సెలవు దినంగా ప్రకటించాలని శశికళ కోరారు. తమిళుల హక్కుల రక్షణ కోసం స్వర్గీయ జయలలిత ఎంతో కృషి చేశారని, ఆమె కృషికి తగిన విధంగా పనిచేసే విధంగా కేంద్రం సహకరించాలని విఙప్తి చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యువతలో ముదురుతున్న సెల్ఫీల పిచ్చి... దాంతో సెల్ఫీసైడ్... ఏం చేస్తుందో తెలుసా?