Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యువతలో ముదురుతున్న సెల్ఫీల పిచ్చి... దాంతో సెల్ఫీసైడ్... ఏం చేస్తుందో తెలుసా?

స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాక.. స్వీయచిత్రాల (సెల్ఫీ)ల పిచ్చి బాగా ముదిరిపోయింది. అంటే ఇదో మానసిక జాఢ్యంగా మారిపోతోంది. ఫలితంగా అనేక మంది అమ్మాయిలు, అబ్బాయిలు అనారోగ్యంతో ఆస్పత్రి పాలవుతున్నారు.

యువతలో ముదురుతున్న సెల్ఫీల పిచ్చి... దాంతో సెల్ఫీసైడ్... ఏం చేస్తుందో తెలుసా?
, మంగళవారం, 10 జనవరి 2017 (12:48 IST)
స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాక.. స్వీయచిత్రాల (సెల్ఫీ)ల పిచ్చి బాగా ముదిరిపోయింది. అంటే ఇదో మానసిక జాఢ్యంగా మారిపోతోంది. ఫలితంగా అనేక మంది అమ్మాయిలు, అబ్బాయిలు అనారోగ్యంతో ఆస్పత్రి పాలవుతున్నారు. 
 
దీనికి ఉదాహరణ... గత రెండు నెలల కాలంలో ముగ్గురు అమ్మాయిలు ఈ వ్యసనంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరడమే. నిజానికి వీరు వేర్వేరు కారణాలతో ఆస్పత్రికి వెళ్లగా.. వైద్యులు వారి వ్యవహారశైలిని గమనించి 'ముందు సెల్ఫీ వ్యసనానికి చికిత్స తీసుకోండి' అంటూ ఎయిమ్స్‌ సైకియాట్రీ విభాగానికి రిఫర్‌ చేయడం గమనార్హం. 
 
ఉదాహరణకు.. హైమ అనే యువతి ఢిల్లీ వర్సిటీ స్టూడెంట్‌. ఇటీవలే ఆమె ముక్కుకు సర్జరీ చేయించుకోడానికి ఎయిమ్స్‌ ఈఎన్‌టీ విభాగానికి వెళ్లింది. వైద్యుడు ఆమెను పరీక్షించి.. ఆమె ముక్కులో ఏ లోపం లేదని తేల్చారు. అందంగా కనపడాలన్న తాపత్రయంతో పదేపదే సెల్ఫీలు తీసుకుంటూ, వాటిని ఇతరుల మెప్పుకోసం సోషల్‌ మీడియాలో పోస్టు చేయడాన్ని వైద్యుడు గమనించాడు. 
 
అంటే ఆమె సెల్ఫీ పిచ్చితో బాధపడుతున్నట్టు గుర్తించి... మానసిక చికిత్స విభాగానికి పంపారు. ఇలాంటి కేసులే ఎయిమ్స్‌లో మరో 2 నమోదయ్యాయి. ఇలా అడ్మిట్ అవుతున్నవారు ఒక్క ఎయిమ్స్‌లోనే కాకుండా ఢిల్లీలోని సుప్రసిద్ధ గంగారామ్‌ ఆస్పత్రిలో కూడా చికిత్సకు చేరారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాడో తాగుబోతు... 'మిలట్రీ భోజనం'పై వైరల్ అయిన వీడియోపై బీఎస్ఎఫ్ వివరణ (Video)