అయోధ్యలో ఆగస్టు 5వ తేదీన రామాలయ నిర్మాణానికి భూమిపూజ జరుగనుంది. ఆ రోజు 1.5 లక్షల దీపాలతో భారీ స్థాయిలో దీపోత్సవం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికితోడు అయోధ్యలోని వివిధ ఆలయాలను దీపాలతో అలంకరించనున్నారు. అలాగే అయోధ్యలో ఎంపికచేసిన 20 ప్రాంతాల్లో భూమి పూజా కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాల కోసం ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేస్తున్నారు.
అయోధ్య పరిశోధనా సంస్థ 20 చోట్ల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనుంది. అన్ని దేవాలయాలలో రామాయణ పారాయణాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలు దూరదర్శన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
అయోధ్యలో ఆగస్టు 5న రామాలయ నిర్మాణానికి భూమిపూజ జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఉత్సవ కార్యక్రమాలకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి.