రాష్ట్రాల అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన 2026 తరువాత జరిగే తొలి జనగణన ప్రచురణ తరువాత ఉంటుందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది.
లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపి ఎ.రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ వ్యవహారాల సహాయ మంత్రి నిత్యానంద రాయ్ సమాధానం ఇచ్చారు.
'ఏపి పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 15లో ఏ నిబంధన ఉన్నప్పటికినీ, రాజ్యాంగంలోని ఆర్టికల్ 170కి లోబడి, ఏపి పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26(1) ప్రకారం ఏపిలో అసెంబ్లీ సీట్లు 175 నుంచి 225కు, తెలంగాణలో అసెంబ్లీ సీట్లు 119 నుంచి 153కు పెంచాలి.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 170(3) ప్రకారం ప్రతి రాష్ట్రంలోని మొత్తం శాసన సభ స్థానాల సంఖ్య సర్దుబాటు 2026 అనంతరం తొలి జనగణన ప్రచురితమయ్యాకే ఉంటుంది' అని మంత్రి సమాధానం ఇచ్చారు.