Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పన్నీర్‌కు సపోర్ట్ చేయమంటే పళనికి సపోర్ట్ చేస్తావా? కున్నూరు ఎమ్మెల్యేకు చుక్కెదురు

చిన్నమ్మ ఏర్పాటు చేసిన కూవత్తూరు రెస్టారెంట్లో హ్యాపీగా మజా చేసిన ఎమ్మెల్యేలకు ప్రస్తుతం తమ తమ నియోజకవర్గాల్లో సినిమా కనిపిస్తోంది. చిన్నమ్మకు సపోర్ట్ చేసి.. పళని స్వామిని సీఎం చేసిన ఎమ్మెల్యేలకు ప్రజ

Advertiesment
పన్నీర్‌కు సపోర్ట్ చేయమంటే పళనికి సపోర్ట్ చేస్తావా? కున్నూరు ఎమ్మెల్యేకు చుక్కెదురు
, బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (09:47 IST)
చిన్నమ్మ ఏర్పాటు చేసిన కూవత్తూరు రెస్టారెంట్లో హ్యాపీగా మజా చేసిన ఎమ్మెల్యేలకు ప్రస్తుతం తమ తమ నియోజకవర్గాల్లో సినిమా కనిపిస్తోంది. చిన్నమ్మకు సపోర్ట్ చేసి.. పళని స్వామిని సీఎం చేసిన ఎమ్మెల్యేలకు ప్రజలు చుక్కలు చూపిస్తున్నారు. ఈ క్రమంలో నీలగిరి జిల్లాలో కున్నూరు శాసనసభ నియోజకవర్గాన్ని మాత్రమే అన్నాడీఎంకే దక్కించుకుంది. ఈ నియోజకవర్గంలో కొత్తగిరికి చెందిన శాంతి ఎ.రాము ఎమ్మెల్యేగా గెలుపొందారు. 
 
ఈ నేపథ్యంలో ఆమె అన్నాడీఎంకే ప్రధానకార్యదర్శి వీకే శశికళ గ్రూపునకు మద్దతు తెలిపారు. గత 5వ తేదీ చెన్నైకు వెళ్లిన శాంతి కూవత్తూరు రిసార్టులో బస చేశారు. ఈ సమయంలో నియోజకవర్గ ప్రజలు, అన్నాడీఎంకే కార్యకర్తలు కొందరు ఈమెను టెలిఫోన్ ద్వారా సంప్రదించి పన్నీర్‌సెల్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు. అయితే ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామికి మద్దతు ఇవ్వడంతో కున్నూర్‌, కోత్తగిరిలోనే కాకుండా జిల్లావ్యాప్తంగా ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. 
 
ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ఎమ్మెల్యే తన స్వగ్రామమైన అరవేనికి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు ఆమె ఇంటిని ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. మరి కొందరు టెలిఫోన్ ద్వారా నిరసన వ్యక్తం చేశారు. దీంతో చేసేదిలేక సోమవారం పూట చెన్నైకి చేరుకున్నారు. వారం రోజుల పాటు చెన్నైలోనే వుండి ఆపై సొంత నియోజక వర్గానికి చేరుకుని ప్రజలకు నచ్చజెప్పాలని ఆమె భావిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోదండరాం ముందస్తు అరెస్టు.. హైదరాబాద్‌లో అప్రకటిత కర్ఫ్యూ.. రోడ్లపై ముళ్ళ కంచెలు