Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోదండరాం ముందస్తు అరెస్టు.. హైదరాబాద్‌లో అప్రకటిత కర్ఫ్యూ.. రోడ్లపై ముళ్ళ కంచెలు

తెలంగాణ రాష్ట్ర రాజకీయ ఐకాస బుధవారం నిర్వహించతలపెట్టిన నిరుద్యోగ నిరసన ర్యాలీకి హైదరాబాద్ నగర పోలీసులు అనుమతి ఇవ్వలేదు. పైగా, టీజేఏసీ ఛైర్మన్‌ కోదండరాంను బుధవారం తెల్లవారుజామునే ముందుస్తుగా అదుపులోకి

కోదండరాం ముందస్తు అరెస్టు.. హైదరాబాద్‌లో అప్రకటిత కర్ఫ్యూ.. రోడ్లపై ముళ్ళ కంచెలు
, బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (09:41 IST)
తెలంగాణ రాష్ట్ర రాజకీయ ఐకాస బుధవారం నిర్వహించతలపెట్టిన నిరుద్యోగ నిరసన ర్యాలీకి హైదరాబాద్ నగర పోలీసులు అనుమతి ఇవ్వలేదు. పైగా, టీజేఏసీ ఛైర్మన్‌ కోదండరాంను బుధవారం తెల్లవారుజామునే ముందుస్తుగా అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లో ఇవాళ నిరుద్యోగ ర్యాలీకి పిలుపునివ్వడంతో కోదండరామ్‌ను సికింద్రాబాద్‌లోని ఆయన నివాసంలో ముందస్తుగా అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి పోలీసులు తరలించారు. పలువురు ఐకాస కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
తెలంగాణలో నిరుద్యోగ సమస్యపై 22న నిర్వహించనున్న ర్యాలీకి అనుమతించకపోవడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ ఐకాస హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. నాగోలులో నిర్వహించేందుకు కోర్టు అనుమతివ్వబోగా ఐకాస పిటిషన్‌ను ఉపసంహరించుకొంది. 
 
ఆ తర్వాత మంగళవారం సాయంత్రం కోదండరాం నివాసంలో చర్చించిన ఐకాస ప్రతినిధులు, నేతలు ఇందిరాపార్కు వద్ద నిరసన కార్యక్రమాలను య‌ధాత‌థంగా శాంతియుతంగా నిర్వహిస్తామని తేల్చి చెప్పింది. ఈ ర్యాలీకి అన్ని జిల్లాలకు చెందిన పలు విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయి. 
 
అప్రమత్తమైన పోలీసులు నగరంలో మోహరించారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ర్యాలీలో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా అప్రకటిత కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. పైగా, రోడ్లపై వాహనాలు తిరగకుండా ఇనుప ముళ్ల కంచెలు వేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమరావతిలో అసెంబ్లీ సమావేశాలు... మార్చి 13న రాష్ట్ర బడ్జెట్‌