Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రామ్మోహన్‌రావుకు గుండెపోటు.. పోరూర్ రామచంద్ర ఆస్పత్రిలో చేరిక..

తమిళనాడు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌రావు అస్వస్థతకు గురయ్యారు. గుండెపోటు రావడంతో ఆయన్ను వెంటనే చెన్నైలోని పోరూరు రామచంద్ర ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రామ్మోహనరావు అత్యవసరవార్డులో చి

Advertiesment
rammohan rao heart attack
, శనివారం, 24 డిశెంబరు 2016 (10:54 IST)
తమిళనాడు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌రావు అస్వస్థతకు గురయ్యారు. గుండెపోటు రావడంతో ఆయన్ను వెంటనే చెన్నైలోని పోరూరు రామచంద్ర ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రామ్మోహనరావు అత్యవసరవార్డులో చికిత్స పొందుతున్నారు. ఇటీవల ఆదాయపన్నుశాఖ అధికారులు రామ్మోహన్‌రావు నివాసంలో సోదాలు నిర్వహించి పలు కీలకపత్రాలు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.
 
మరోవైపు చెన్నైలో జరుగుతున్న వరుస ఐటీ దాడుల నేపథ్యంలో.. పలు ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. నోట్ల రద్దు నేపథ్యంలో పలువురు బడాబాబులపై కన్నేసిన ఐటీ శాఖ పక్కా నిఘాతో తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు బండారం బయటపడేలా చేసినట్టు తెలుస్తోంది.
 
నోట్ల రద్దు తర్వాతి పరిణామాలను ముందుగానే పసిగట్టిన ఐటీ అధికారులు.. భారీ ఎత్తున పాత కరెన్సీ మార్పిడికి గురవుతుందని అంచనా వేశారు. ఈ మేరకు పలువురు పెద్ద తలకాయల కదలికలపై నిఘా పెట్టారు. ఇందులో భాగంగానే టీటీడీ పాలకమండలి సభ్యుడు శేఖర్ రెడ్డిపై నిఘా పెట్టగా.. అదే ఉచ్చులో తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు కూడా చిక్కుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రామ్మోహన్‌రావు నివాసంలో డైరీ లభ్యం.. 20కి పైగా కీలక దస్త్రాలను పరిశీలించారు..