Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రామ్మోహన్‌రావు నివాసంలో డైరీ లభ్యం.. 20కి పైగా కీలక దస్త్రాలను పరిశీలించారు..

తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌రావు నివాసంలో ఆదాయపన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు భావిస్తున్న దైనందిని(డైరీ) ప్రస్తుతం పాలకపక్షం అన్నాడీఎంకేకు చెందిన కీలక నేతలు, ఐఏఎస్‌, ఐపీఎ

Advertiesment
రామ్మోహన్‌రావు నివాసంలో డైరీ లభ్యం.. 20కి పైగా కీలక దస్త్రాలను పరిశీలించారు..
, శనివారం, 24 డిశెంబరు 2016 (09:45 IST)
తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌రావు నివాసంలో ఆదాయపన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు భావిస్తున్న దైనందిని(డైరీ) ప్రస్తుతం పాలకపక్షం అన్నాడీఎంకేకు చెందిన కీలక నేతలు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. రామ్మోహనరావు నివాసంలో ఆదాయపన్ను అధికారులు దాడులు నిర్వహించి కీలక పత్రాలు, ల్యాప్‌టాప్‌ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ డైరీ కూడా ఉందని సమాచారం.  
 
దైనందినలో ఆదాయ పన్ను అధికారులకు పాలకపక్షానికి చెందిన నేతలు, మంత్రులు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల పేర్లు కనిపించినట్లు చెప్తున్నారు. అన్నాడీఎంకే సీనియర్‌ నేతలకు సాయం చేసిన కీలక పనుల గురించి ఆయన వివరంగా రాసుకున్నట్లు.. ఓ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి పేరు, ఐపీఎస్‌ అధికారుల్లో ఐజీ, ఏడీజీపీ స్థాయిలోని కొందరు అధికారుల పేర్లున్నాయని తెలిసింది. 
 
వీరంతా వృత్తి రీత్యా రామమోహనరావుతో కలిసి పనిచేశారని తెలియడంతో వారి టెలిఫోన్‌ సంభాషణలను అధ్యయనం చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. దైనందినలోని పేర్ల ఆధారంగా ఆ అధికారులపై ఆదాయ పన్ను దాడులకు సన్నాహాలు జరుగుతున్నాయంటున్నారు. తమిళనాడు దివంగత సీఎం జయలలిత అపోలో ఆస్పత్రిలో రెండున్నర నెలలు ఉన్నప్పుడు ప్రధాన కార్యదర్శి హోదాలో రామ్‌మోహనరావు సంతకాలు చేసిన 20కి పైగా కీలక దస్త్రాలను కూడా అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డాగ్ మాంసంతో బిర్యానీ తయారీ.. వాట్సాప్‌లో ఫేక్.. వ్యక్తి అరెస్ట్