అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఆగస్టులోనే భూమిపూజ నిర్వహించాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం సాయంత్రం జరిగిన సమావేశంలో ట్రస్టు తీర్మానించింది.
ప్రధాని మోదీ మందిర నిర్మాణానికి భూమి పూజ చేస్తారని ప్రకటించింది. భూమిపూజ చేసిన రోజే నిర్మాణ పనులను ప్రారంభించనున్నామని ట్రస్టు అధికారులు తెలిపారు. ఇంకా భూమి పూజకు ముహూర్తం కూడా ఖరారు చేశారు.
ఆగస్టు 5న అయోధ్యలో జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రధాని హాజరుకానున్నారు. శ్రీరాముని ఆలయ భూమి పూజకు సంబంధించిన కార్యక్రమాలు వచ్చేనెల 5న ఉదయం 5 గంటలకు ప్రారంభమవుతాయి. దీంతో ఆగస్టు 5న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.10 గంటల వరకు ప్రధాని మోదీ అయోధ్యలో ఉంటారని సమాచారం.
ప్రధాని ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకర్గం కూడా కావడంతో రామమందిర భూమిపూజ వేడుకలో ఆయన పాల్గొననున్నారు. కాశీకి చెందిన పూజారులతోపాటు వారణాసికి చెందిన కొందరు పూజారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది.