Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రజనీకాంత్‌కు నమిత, మీనా మద్దతు.. జగద్రక్షకన్‌కు పిలుపు.. ఫ్యాన్స్ ఫైర్.. బీజేపీలో చేరుతారా?

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నాన్ లోకల్ అంటూ వివాదం చెలరేగినా.. కొన్ని గ్రూపులు నిరసన వ్యక్తం చేసినా.. కబాలికి ఫ్యాన్స్ మద్దతు పెరిగిపోతోంది. దీంతోపాటు సీనియర్ హీరోయిన్ల సపోర్ట్ కూడా పెరిగిపోతోంది. తాజ

Advertiesment
రజనీకాంత్‌కు నమిత, మీనా మద్దతు.. జగద్రక్షకన్‌కు పిలుపు.. ఫ్యాన్స్ ఫైర్.. బీజేపీలో చేరుతారా?
, గురువారం, 25 మే 2017 (10:58 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నాన్ లోకల్ అంటూ వివాదం చెలరేగినా.. కొన్ని గ్రూపులు నిరసన వ్యక్తం చేసినా.. కబాలికి ఫ్యాన్స్ మద్దతు పెరిగిపోతోంది. దీంతోపాటు సీనియర్ హీరోయిన్ల సపోర్ట్ కూడా పెరిగిపోతోంది. తాజాగా రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమంటూ తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ బలమైన సంకేతాలు ఇవ్వడంతో  సీనియర్ నటీమణులు మీనా, నమిత మద్దతు ప్రకటించారు. 
 
స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 15వ తేదీన రజనీకాంత్ కొత్త పార్టీ గురించి అధికారికంగా ప్రకటన చేస్తారని.. పార్టీ జెండాను కూడా ఇప్పటికే డిజైన్ చేశారని సమాచారం. ఆ పార్టీలో చేరేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు మీనా, నమితలు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. రజనీకాంత్ తన రాజకీయ సలహాదారుగా ఓ సీనియర్‌ జర్నలిస్టును నియమించుకున్నట్లు సమాచారం.
 
అలాగే రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశం జరిగితే తమిళనాడులోని ద్రవిడ పార్టీలతో పాటు జాతీయ పార్టీల నాయకులు ఆయన నేతృత్వంలోని కొత్త పార్టీలో చేరడానికి క్యూలో ఉన్నారు. అయితే రజనీకాంత్ ఆచితూచి అడుగులు వేసి సీనియర్ నాయకులను తన పార్టీలోకి ఆహ్వానించేందుకు సంసిద్ధమైనట్లు తెలుస్తోంది. 
 
రజనీకాంత్ డీఎంకే పార్టీలోని సీనియర్ నాయకుడు జగద్రక్షకన్‌ను తన కొత్త పార్టీలో చేరాలని వర్తమానం పంపించారని తెలియడంతో స్టాలిన్ వర్గం ఉలిక్కిపడింది.  డీఎంకే చీఫ్ కరుణానిధికి అత్యంత సన్నిహితుడు, కేంద్ర మాజీ మంత్రి అయిన జగద్రక్షకన్ పార్టీని వీడితే పెద్ద సమస్య ఎదురయ్యే అవకాశం ఉందని డీఎంకే వర్గాలు జడుసుకుంటున్నాయి. 
 
అయితే డీఎంకే సీనియర్ నాయకుడు, బొగ్గు స్కాంతో పాటు అనేక విషయాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న జగద్రక్షకన్‌ను రజనీకాంత్ తన రాజకీయ పార్టీలోకి ఆహ్వానించారని, ఆయనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుసుకున్న ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే బీజేపీలో రజనీకాంత్‌ను చేర్చుకునేందుకు ఆ పార్టీ అధిష్టానం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. కానీ తమిళ రాష్ట్రంలో ద్రవిడ పదంలేని పార్టీకి అంత క్రేజుండదని.. బీజేపీలో రజనీ చేరితే తమిళ ప్రజల మద్దతు కరువయ్యే అవకాశం ఉన్నట్లు రాజకీయ పండితులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భయపడుతూ బతకలేకే... ఇంట్లోని కత్తులు, కొడవళ్లతో నారాయణరెడ్డిని చంపేశాం : నిందితుల వాంగ్మూలం