Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భయపడుతూ బతకలేకే... ఇంట్లోని కత్తులు, కొడవళ్లతో నారాయణరెడ్డిని చంపేశాం : నిందితుల వాంగ్మూలం

వైసీపీ నేత చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్యకు పాత కక్షలే కారణంగా తెలుస్తున్నాయి. రెండు దశాబ్దాలుగా ఉన్న పగ... తాజాగా వచ్చిన బెదిరింపుల నేపథ్యంలో బీసన్నగారి రామాంజనేయులు, కోతుల రామాంజనేయులు మరికొందరితో క

Advertiesment
Narayana Reddy murder case
, గురువారం, 25 మే 2017 (10:21 IST)
వైసీపీ నేత చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్యకు పాత కక్షలే కారణంగా తెలుస్తున్నాయి. రెండు దశాబ్దాలుగా ఉన్న పగ... తాజాగా వచ్చిన బెదిరింపుల నేపథ్యంలో బీసన్నగారి రామాంజనేయులు, కోతుల రామాంజనేయులు మరికొందరితో కలిసి ఈ హత్య చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఇటీవల కర్నూలు జిల్లా పత్తికొండలో వైకాపా నేత నారాయణ రెడ్డి దారుణ హత్యకు గురైన విషయం తెల్సిందే. ఈ హత్య కేసులో 12 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితులు వాంగ్మూలం ఇచ్చారు. 
 
'మా మధ్య పాత పగలు ఉన్నాయి. మా తండ్రులను, తాతలను చంపారు, చంపించారు. మా ఆడోళ్లను చెరపట్టారు. మా సొంత పొలాలకే నారాయణ రెడ్డికి కప్పం కట్టాల్సి వచ్చింది. పోయినంతకాలం ఆయనకు భయపడుతూ బతకాల్సిందేనా? అందుకే చంపేశాం’ అని చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో నిందితులు పోలీసులకు ఇచ్చిన వాగ్మూలంలో తెలిపారు. 
 
పైగా, హత్య వెనుక ఎలాంటి ప్రణాళిక లేదన్నారు. నారాయణ రెడ్డి కొసనపల్లె గ్రామానికి వస్తారని ఒకరోజు ముందుగానే తెలుసుకున్నామని... అప్పటికప్పుడు అందరినీ కూడగట్టుకుని హత్య చేశామన్నారు. 'ఎవరికి వారు మా ఇళ్లలో ఉన్న కత్తులు తీసుకున్నాం. రామానాయుడు, రామాంజనేయులు తమ ట్రాక్టర్లను తీసుకొచ్చారు. వెనుక, ముందు వైపు నుంచి ఒక్కసారిగా ట్రాక్టర్లతో నారాయణ రెడ్డి వాహనాన్ని ఢీకొట్టాం. నారాయణ రెడ్డిని, సాంబశివుడిని చంపేశాం' అని నిందితులు వాంగ్మూలంలో వివరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జనాభా లెక్కల్లో కూడా చైనా ప్రాడ్ అట.. ప్రపంచ జనాభాలో మనమే ఫస్ట్ అట.. చైనా పరిశోధకుడే సెలవిచ్చాడు