Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జనాభా లెక్కల్లో కూడా చైనా ప్రాడ్ అట.. ప్రపంచ జనాభాలో మనమే ఫస్ట్ అట.. చైనా పరిశోధకుడే సెలవిచ్చాడు

చాలా విషయాల్లో చైనా దొంగ లెక్కలు చెబుతోందని ప్రపంచం ఎంతో కాలంగా భావిస్తోంది. మిగతా అంశాల మాటేమిటో గానీ, చివరకు జనాభా విషయంలో చైనా దొంగ లెక్కలు చెప్పడంలో ఆరితేరిపోయిందన్న విషయం తాజాగా బయటపడింది. కాగా చ

జనాభా లెక్కల్లో కూడా చైనా ప్రాడ్ అట.. ప్రపంచ జనాభాలో మనమే ఫస్ట్ అట.. చైనా పరిశోధకుడే సెలవిచ్చాడు
హైదరాబాద్ , గురువారం, 25 మే 2017 (09:51 IST)
చాలా విషయాల్లో చైనా దొంగ లెక్కలు చెబుతోందని ప్రపంచం ఎంతో కాలంగా భావిస్తోంది. మిగతా అంశాల మాటేమిటో గానీ, చివరకు జనాభా విషయంలోనూ చైనా దొంగ లెక్కలు చెప్పడంలో ఆరితేరిపోయిందన్న విషయం తాజాగా బయటపడింది. కాగా చైనా భండారాన్ని ఏ అమెరికనో లేదా చైనా వ్యతిరేకో బయటపెట్టలేదు. సాక్షాత్తూ చైనాకు చెందిన ఒక పరిశోధకుడే  ఈ విషయాన్ని బయటపెట్టడం సంచలనం కాగా, దాన్ని గత్యంతరం లేక చైనా ప్రముఖ పత్రికలన్నీ ప్రచురించడం మరొక సంచలనం. 
 
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం భారత్‌ అని ఆయన చెబుతున్నారు. యూనివర్సిటీ ఆఫ్‌ విస్కోన్సిన్‌-మాడిసన్‌ రీసెర్చర్‌ అయిన యి ఫుక్సియన్‌.. చైనాలోని పెకింగ్‌ విశ్వవిద్యాలయంలో ఓ కార్యక్రమానికి అతిథిగా హాజరై ప్రసంగించారు. చైనా అధికారిక జనాభా లెక్కలు తప్పుడువని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం భారతే ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశమని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం ఏదీ అంటే కొన్ని సంవత్సరాలుగా నిర్ద్వందంగా చైనా అని సమాధానం చెబుతున్నాం. కానీ ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం చైనా కాదంటూ షాక్‌ ఇచ్చారు యి ఫుక్సియన్‌. 
 
ఇందుకు కొన్ని లెక్కలను కూడా  చెప్పారు యి ఫుక్సియన్‌.. ఆయన అభిప్రాయం ప్రకారం 1991 నుంచి 2016 వరకూ చైనాలో 377.6 మిలియన్ల జననాలు నమోదు అయ్యాయి. కానీ, రికార్డుల్లో మాత్రం ఇదే కాలంలో 464.8 మిలియన్ల జననాలు జరిగినట్లు ఉంది. దీన్ని బట్టి ప్రస్తుతం చైనా జనాభా 1.38 బిలియన్లు అంటే 138 కోట్లు కాదని తేలిపోతుందని చెప్పారు. ఫుక్సియన్‌ ప్రకటనను చైనాకు చెందిన పలు మీడియా సంస్ధలు ఇటీవలే ప్రముఖంగా ప్రచురించాయి.
 
చైనా తన జనాభా విషయంలో ఇంత పెద్ద మోసపు లెక్కలు చెప్పడానికి కారణం చైనాను భారత్‌ జనాభాలో దాటేస్తే చైనా వృద్ధిరేటు అమాంతం పడిపోయే అవకాశం ఉండటమేనట. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం 2022కల్లా భారత్‌ ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించాలి. ఈ విషయాన్ని 2013లోనే తన పుస్తకం 'బిగ్‌ కంట్రీ విత్‌ యాన్‌ ఎంప్టీ నెస్ట్‌' లో ప్రస్తావించినట్లు ఫుక్సియన్‌ తెలిపారు. 2003 నుంచి ఇలా చైనా అధికారిక రికార్డుల్లో జనాభా లెక్కలు తప్పుగా వస్తున్నాయని తాను గ్రహించినట్లు వెల్లడించారు.
 
మొత్తం మీద తేలిందేమిటంటే చైనా ఉత్పత్తులు మోసం, వాటి నాణ్యత మోసం, అది చెప్పే లెక్కలు కూడా మోసమే. ప్రపంచంలో ఎవరయినా జనాభా లెక్కల్లో తప్పులతడకును ప్రదర్శిస్తారా. ఒక్క చైనా తప్ప. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అబద్ధాలు చెప్పకపోతే ఉద్యోగం రాదు.. అబద్దం చెబితే వచ్చే ఉద్యోగం కూడా రాదు. ఈ తమాషా ఏంటి