Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జైన గురువు పార్థివదేహాన్ని వేలంలో రూ.11 కోట్లకు దక్కించుకుని అంత్యక్రియలు

తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ రాజకీయాల్లోకి రానున్నారని ఆయన ఫ్యాన్స్ ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. రజనీకాంత్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్ ఒకటొచ్చింది. తాజాగా రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణ, రజనీ పొలిటికల్ ఎం

Advertiesment
జైన గురువు పార్థివదేహాన్ని వేలంలో రూ.11 కోట్లకు దక్కించుకుని అంత్యక్రియలు
, మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (09:30 IST)
ముంబైలో ఓ జైన గురువు పార్థివదేహాన్ని వేలం పాటలో రూ.11 కోట్లకు ఇద్దరు వ్యక్తులు దక్కించుకుని అంత్యక్రియలు నిర్వహించిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే... తపగచ్ఛ జాతి గురువు ప్రేమ్‌సుర్జీస్వజీ (97) ఆదివారం ఉదయం ముంబైలోని సైఫీ ఆస్పత్రిలో మృతిచెందారు. 
 
ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు వాల్వేశ్వర్‌ ప్రాంతంలోని బాబు పన్నాలాల్‌ జైన దేవాలయంలో వేలంపాట నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జైనమతానికి చెందిన ఓ వైద్యుడు, ఓ నిర్మాణ సంస్థ అధినేత, మరో ముగ్గురు ప్రముఖ వ్యాపారులు మొత్తం రూ.11,11,11,111కు సొంతం చేసుకున్నారు. 
 
ఈ నగదులో కొంత మొత్తాన్ని ధార్మిక, సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామన్నారు. అనంతరం నాలుగు వెండి కుండల్లో నీళ్లు నింపి ప్రేమ్‌సుర్జీస్వజీ పార్థివదేహాన్ని ఉంచి అంతిమయాత్ర నిర్వహించారు. ఆయన మృతదేహాన్ని 300 కిలోల గంధపు చెక్కలతో ఖననం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంక్రాంతికి ''శతమానం భవతి''.. శరవేగంగా షూటింగ్