సంక్రాంతికి ''శతమానం భవతి''.. శరవేగంగా షూటింగ్
శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ జంటగా వేగేశ్న సతీష్ దర్శకత్వంలో దిల్ రాజు తెరకెక్కిస్తున్న చిత్రం ''శతమానం భవతి''. ఈ సినిమాను సంక్రాంతి బరిలో విడుదల చేయాలనే దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు. మళ్లీ మళ్లీ ఇది
శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ జంటగా వేగేశ్న సతీష్ దర్శకత్వంలో దిల్ రాజు తెరకెక్కిస్తున్న చిత్రం ''శతమానం భవతి''. ఈ సినిమాను సంక్రాంతి బరిలో విడుదల చేయాలనే దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు. మళ్లీ మళ్లీ ఇది రానిరోజు, ఎక్స్ ప్రెస్ రాజా సక్సెస్ లతో ఫుల్ జోష్ మీద ఉండడంతో, ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రాజమండ్రి సమీపంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. జయసుధ, శర్వానంద్ , అనుపమ పరమేశ్వరన్, రాజా రవీంద్రలపై కీలక సన్నివేశాలు షూట్ చేయడం జరుగుతుంది.
ప్రకాష్‌రాజ్, జయసుధ, ఇంద్రజ, శివాజీరాజా, ప్రవీణ్, సిజ్జు, శ్రీరాం, మధురిమ, నీల్యా, ప్రమోదిని, మహేష్, భద్రం, హిమజ, ప్రభు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సమీర్‌రెడ్డి, సంగీతం: మిక్కీ జె.మేయర్, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, కూర్పు: మధు, ఆర్ట్: రమణ వంక, కథ, కథనం, మాటలు,దర్శకత్వం: వేగేశ్న సతీష్.