సాధారణంగా మన భారతీయ వివాహం చట్ట, సంస్కృతి సంప్రదాయాల మేరకు ఒసారి పెళ్లి చేసుకుంటే కడదాకా ఆ దంపతులు జీవించాలి. కానీ, ఆ మన దేశంలోని ఓ రాష్ట్రంలో మాత్రం ఓ వింత ఆచారం ఉంది. ఓ మహిళ యేడాదికొక భాగస్వామితో సహజీవ
నం చేయొచ్చు. అంటే తనకు నచ్చిన మగాడిని ఎంచుకుని ఒక సంవత్సరం పాటు దాంపత్య జీవితం కొనసాగించవచ్చు.
ఈ యేడాది ఆ మహిళ గర్భందాల్చితే మాత్రం ఆ పురుషుడు ఆమెను వివాహం చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మరో యేడాది మరో కొత్త పురుషుడుని ఆ మహిళ ఎంచుకోవచ్చు. అయితే, మహిళ ఎంచుకునే పురుషుడు కొంత మొత్తంలో డబ్బు కూడా చెల్లించాల్సివుంటుంది. ఈ వింత ఆచారం రాజస్థాన్ రాష్ట్రంలోని గరాసియా అనే గిరిజన తెగలో ఉంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
ఈ గ్రామానికి చెందిన మహిళలు ప్రతి యేటా తమకు నచ్చి కొత్త భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ కలిగివుంటారు. దశాబ్దాలుగా ఈ వింత ఆచారం కొనసాగుతోంది. ఈ తెగ వారు ప్రతి యేటా ఒక ప్రత్యేక జాతరను నిర్వహిస్తారు. ఇందులో మహిళలు తమకు నచ్చిన పురుషుడుని జీవిత భాగస్వామిగా ఎంపిక చేసుకుంటారు. ఆ తర్వాత వారిద్దరూ కలిసి సహజీవనం ప్రారంభిస్తారు. ఇలా సహజీవనం మొదలుపెట్టేందుకు పురుషుడు కొంత మొత్తంలో డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.
వారి సహజీవన కాలంలో మహిళ గర్భం దాలిస్తే అపుడు వారు తప్పనిసరిగా వివాహం చేసుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ తమ ప్రస్తుత భాగస్వామితో జీవించడం ఇష్టం లేకపోతే సదరు మహిళ మరో వ్యక్తిని ఎంచుకునే అవకాశం కూడా ఉంది. అయితే, అలా కొత్తగా వచ్చే వ్యక్తి ఆమె పాత భాగస్వామికి అంతకంటే ఎక్కువ మొత్తంలో డబ్బును పరిహారంగ చెల్లించాలనే నిబంధన ఉంది. ఈ ఆచారం గురించి తెలుసుకున్న నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.