Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజస్థాన్‌లో క్రూరం : ఆర్టీఐ కార్యకర్త కాళ్లకు మేకులు కొట్టారు...

రాజస్థాన్‌లో క్రూరం : ఆర్టీఐ కార్యకర్త కాళ్లకు మేకులు కొట్టారు...
, శుక్రవారం, 24 డిశెంబరు 2021 (08:41 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో కొందరు దుండగులు అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. మద్యం మాఫియాపై ఫిర్యాదు చేశాడన్న అక్కసుతో ఆర్టీఐ కార్యకర్తను కిడ్నాప్ చేశారు. కాళ్లకు మేకులు కొట్టారు. చేతులు కాళ్లు కట్టేసి చిత్ర హింసలు పెట్టారు. ఆ తర్వాత ఆ కార్యకర్త చనిపోయాడని భావించి రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయాడు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని బార్మర్ జిల్లాకు చెందిన 30 యేళ్ల అమ్రారామ్ గోద్రా అనే వ్యక్తి ఓ ఆర్టీఐ కార్యకర్త. గ్రామ పంచాయతీ పరిధిలో అవినీతి, మద్యం, అక్రమ అమ్మకాలపై ఫిర్యాదు చేశారు. 
 
ఈ విషయం తెలుసుకున్న మద్యం మాఫియా ఈ నెల 21వ తేదీన ఆయన్ను కిడ్నాప్ చేసింది. ఆపై ఇనుమపరాడ్లతో ఆయనపై దాడి చేశారు. కాళ్లు చేతులు విరగ్గొట్టారు. ఆ తర్వాత రెండు కాళ్లకు మేకులు కొట్టారు. ఆ చిత్ర హింసలు భరించలేక అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో అతను చనిపోయాడని భావించి ఓ రోడ్డుపక్కన పడేసి వెళ్లిపోయారు. 
 
అతన్ని గమనించిన కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అతన్ని ఆస్పత్రికి తరలించినట్టు బార్మర్ ఎస్పీ దీపక్ భార్గవ వెల్లడించారు. ఈ ఘటనపై అత్యంత కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు ఆయన వెల్లడించారు. నిందితుల కోసం నాలుగు బృందాలు ఏర్పాటు చేశామని, వీలైనంత త్వరగా వారిని పట్టుకుని శిక్షిస్తామని ఎస్పీ తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒక్కసారిగా పెరిగిన ప్రయాణికుల రద్దీ - చార్జీల్లో 3 రెట్లు పెంపుదల