పుత్రులు పెరిగినా వివాహేతర సంబంధం కొనసాగించింది.. ప్రియుడితో పాటు బలైపోయింది.. ఎలా?
పుత్రులు పెద్దవారైనప్పటికీ.. వివాహేతర సంబంధం పెట్టుకున్న పాపానికి ఆ తల్లి బలైపోయింది. రాజస్థాన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. రాజస్థాన్‌లో ఇద్దరు యువకులకు తన తల్లి అక్రమ సంబంధం పెట్టుకోవడం నచ్చలేదు. తమ తల్ల
పుత్రులు పెద్దవారైనప్పటికీ.. వివాహేతర సంబంధం పెట్టుకున్న పాపానికి ఆ తల్లి బలైపోయింది. రాజస్థాన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. రాజస్థాన్‌లో ఇద్దరు యువకులకు తన తల్లి అక్రమ సంబంధం పెట్టుకోవడం నచ్చలేదు. తమ తల్లి వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న తనయులు.. ఆమెతో పాటు ఆమె ప్రియుడిని కూడా కొట్టి చంపేశారు.
ఈ విషయాన్ని గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ శ్రీగంగానగర్ జిల్లాలో గొగామెది గ్రామానికి చెందిన బల్జీత్ కౌర్ (39) భర్త లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వారికి ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు.
తన భర్తతో ఏర్పడిన విభేదాల కారణంగా.. ఓ కుమారుడు, కుమార్తెతో బల్జీత్ కౌర్ వేరుగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆమె సుఖ్‌పాల్ అనే వ్యక్తితో నెలల పాటు వివాహేతర సంబంధం కొనసాగించింది. అయితే అమ్మతీరు నచ్చని ఇద్దరు తనయులు విశాల్ సింగ్(21), హర్దీప్ సింగ్(19) ఆమెను, ఆమె ప్రియుడిని గొగామెది గ్రామానికి రప్పించి, పదునైన ఆయుధంతో దాడి చేసి చంపేశారు.